మూడు రోజుల కస్టడీలో 300 ప్రశ్నలు: అఖిలప్రియ నుండి కీలక సమాచారం సేకరణ

By narsimha lode  |  First Published Jan 13, 2021, 5:55 PM IST

హైద్రాబాద్ బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ నుండి పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు.


హైదరాబాద్: హైద్రాబాద్ బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ నుండి పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు.

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో కోర్టు అనుమతితో మూడు రోజులుగా భూమా అఖిలప్రియను పోలీసులు విచారించారు. మూడో రోజు కస్టడీ బుధవారం నాటితో పూర్తైంది. సుమారు 300కిపైగా ప్రశ్నలకు పోలీసులు అఖిలప్రియ నుండి సమాధానాలు రాబట్టారని సమాచారం.

Latest Videos

undefined

ప్రవీణ్ రావుతో పాటు ఆయన ఇద్దరు సోదరులను కిడ్నాప్  చేసిన కేసులో ఇంకా 15 మంది కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చంద్రహాస్, భార్గవ్ రామ్ తో పాటు మాడాల శ్రీనివాస్ దొరికితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. 

అఖిలప్రియ నుండి రాబట్టిన సమాచారం మేరకు ఎంజీఎం స్కూల్, కూకట్ పల్లి హోటల్ లో ఆధారాలు సీజ్ చేశారు. ఎంజీఎం స్కూల్లో కిడ్నాపర్లతో  భార్గవ్, చంద్రహాస్ లు భేటీ అయ్యారని పోలీసులు గుర్తించారు. 

కూకట్‌పల్లి హోటల్ లో మాడాల శ్రీనుతో  భార్గవ్ సమావేశమైనట్టుగా పోలీసులు తెలిపారు. స్కూల్ లో సినిమా చూపి కిడ్నాప్ నకు స్కెచ్ వేశారని పోలీసుల విచారణలో తేలింది.కిడ్నాప్ సమయంలో బోయిన్ పల్లి వరకు కారులోనే భార్గవ్ రామ్ వెళ్లాడు. కిడ్నాప్ తర్వాత మెయినాబాద్ ఫామ్ హౌస్ చేరుకొన్నాడు భార్గవ్ రామ్.

సంజయ్, ప్రవీణ్ తో సంతకాలు చేయించుకొన్న భార్గవ్ రామ్. ఆ తర్వాత  ఆయన మొయినాబాద్ లోని ఫామ్‌హౌస్ కు చేరుకొన్నాడు.తర్వాత పోలీసుల వేటతో  అఖిలప్రియ ప్లాన్ మార్చినట్టుగా పోలీసులు విచారణలో తెలుసుకొన్నారు. కిడ్నాప్ చేసిన వారిని వెంటనే వదిలేయాలంటూ అఖిలప్రియ ఆదేశించింది.ఈ ఆదేశాల మేరకు కిడ్నాపర్లు వారిని వదిలేశారని పోలీసులు గుర్తించారు.
 

click me!