రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ బావిలో చిరుతపులి పడింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. బావిలో పడిన పులిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ బావిలో చిరుతపులి పడింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. బావిలో పడిన పులిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
బోయిన్‌పల్లి మండలం మల్కాపూర్ శివారులోని వ్యవసాయబావిలో చిరుతపులి పడినట్టుగా గుర్తించారు.ఈ విషయం తెలిసిన స్థానికులు పెద్ద ఎత్తున బావి వద్దకు చేరుకొని పులిని చూసేందుకు వచ్చారు.బావిలో పడిన పులిని బయటకు తీసి అడవిలో వదిలేయాలని స్థానికులు కోరుతున్నారు.ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఇటీవల కాలంలో పులులు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఆసిఫాబాద్ జిల్లాలో ఓ పులి చాలా రోజులుగా ప్రజలను భయబ్రాంతుల్ని చేస్తోంది. రెండు రోజులుగా ఈ పులిని పట్టుకొనేందుకు అటవీశాఖాధికారులు ప్రయత్నిస్తున్నారు. మహారాష్ట్రతో పాటు తెలంగాణ రాష్ట్రం నుండి షార్ప్ షూటర్లను రప్పించారు. ఈ షూటర్ల ద్వారా మత్తు ఇంజెక్షన్లను పులిపై ప్రయోగించేందుకు అటవీశాఖాధికారులు ప్రయత్నిస్తున్నారు. పులి కోసం అటవీశాఖాధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.