తెలంగాణ పోలీసులకు అది ఫ్యాషన్ అయింది.. ఎమ్మెల్యే రఘునందన్ రావు..

Published : Jan 13, 2021, 05:14 PM IST
తెలంగాణ పోలీసులకు అది ఫ్యాషన్ అయింది.. ఎమ్మెల్యే రఘునందన్ రావు..

సారాంశం

జనగామలో బీజేపీ నాయకులపై పోలీసులు దాడి చేయడాన్ని ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయడం తెలంగాణ పోలీసులకు ఫ్యాషన్ అయిపోయిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

జనగామలో బీజేపీ నాయకులపై పోలీసులు దాడి చేయడాన్ని ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయడం తెలంగాణ పోలీసులకు ఫ్యాషన్ అయిపోయిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్ర పోలీసుల తీరుపై బీజేపీ నాయకుడు, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నాడు మెదక్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. జనగామలో బీజేపీ నాయకులపై పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులపై దాడులు చేయడం పోలీసులకు ఫ్యాషన్‌గా మారిందని విమర్శించారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డిపై ఆయన ధ్వజమెత్తారు. ఖాకీ యూనిఫాం విలువ తీయవద్దని మహేందర్ రెడ్డికి ఎమ్మెల్యే రఘునందన్ సూచించారు. 

టీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరించాలని అనుకుంటే ఖాకీ యూనిఫాంను పక్కనబెట్టి మహేందర్ రెడ్డి నేరుగా టీఆర్ఎస్ కండువా కప్పుకోవాలని వ్యాఖ్యానించారు. నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రఘునందన్ మండిపడ్డారు. జనగామ వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అడ్డుకోవడం దారుణం అన్నారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu