హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిలో డాక్టర్ పై దాడి చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా అనుమానితుడితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదైందని ఉస్మానియా ఆసుపత్రి నమోదైంది.
ఉస్మానియా ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో చికిత్స నిర్వహిస్తున్న డాక్టర్ పై కరోనా అనుమానిత రోగితో పాటు అతని బంధవులు మంగళవారం నాడు దాడికి దిగారు.
కరోనా రోగులను కేటాయించిన వార్డులోనే కరోనా అనుమానిత రోగులను కూడ ఒకే వార్డులో చేర్చడంపై అనుమానిత రోగి డాక్టర్ పై దాడికి దిగాడు.
కరోనా అనుమానిత రోగి నుండి శాంపిల్స్ తీసుకొని ల్యాబ్ కు పంపారు వైద్యులు. అయితే ఇంటికి వెళ్తానని ఆ రోగి చెప్పడంతో డాక్టర్ నిరాకరించాడు. తమను ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో పాటు కరోనా రోగుల పక్కనే తమను ఉంచడంపై కరోనా అనుమానిత రోగి డాక్టర్ తో వాగ్వాదానికి దిగాడు. అంతేకాదు డాక్టర్ పై దాడి చేశాడు.
also read:
కరోనా ఎఫెక్ట్: ఉస్మానియా ఆసుపత్రి డాక్టర్లపై రోగుల దాడి
ఈ విషయమై ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండ్ డాక్టర్ నాగేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు కరోనా అనుమానిత రోగితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
also read:
లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘనలు: ఎల్బీనగర్ డీ మార్ట్ సీజ్
ఇదిలా ఉంటే డాక్టర్ పై దాడికి పాల్పడిన రోగి శాంపిల్స్ రిపోర్టు మంగళవారం నాడు సాయంత్రం వచ్చింది. అయితే అతను అప్పటికే ఇంటికి వెళ్లాడు. అతనికి కరోనా వైరస్ సోకిందని ఈ రిపోర్ట్ తేల్చి చెప్పింది.
దీంతో అతడిని ఐసోలేషన్ వార్డులో ఉంచేందుకు గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిన్న జరిగిన ఘటనతో ఉస్మానియా ఆసుపత్రి వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.