డిమాండ్ల సాధనకు గాంధీ ఆసుపత్రి స్టాఫ్ నర్సులు సమ్మె నోటీసు

By narsimha lodeFirst Published Apr 15, 2020, 11:45 AM IST
Highlights
కరోనా వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్న ప్రధాన ఆసుపత్రుల్లో గాంధీ ఆసుపత్రి ఒకటి. అయితే ఈ ఆసుపత్రిలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ పద్దతిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు సమ్మె నోటీసు ఇచ్చారు.
హైదరాబాద్: కరోనా వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్న ప్రధాన ఆసుపత్రుల్లో గాంధీ ఆసుపత్రి ఒకటి. అయితే ఈ ఆసుపత్రిలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ పద్దతిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు సమ్మె నోటీసు ఇచ్చారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు ఈ మేరకు మంగళవారం నాడు సమ్మె నోటీసు ఇచ్చారు.

హైద్రాబాద్ గాంధీ ఆసుపత్రి కరోనా పాజిటివ్ కేసుల  చికిత్సకు నోడల్ కేంద్రంగా ఉంది. ఈ ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ పద్దతిలో 13 ఏళ్లుగా 200 మంది స్టాఫ్ నర్సులు పనిచేస్తున్నారు. ప్రతి నెలా వీరికి వేతనాలు సరిగా అందడం లేదు.

కరోనా వైరస్ సోకిన రోగులకు తాము తమ ప్రాణాలను ఫణంగా పెట్టి సేవలు చేస్తున్నట్టుగా  స్టాఫ్ నర్సులు గుర్తు చేశారు. తమను రెగ్యులరైజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. లేదా కనీసం కాంట్రాక్టు పద్దతిలోనైనా విధుల్లోకి తీసుకోవాలని నర్సులు డిమాండ్ చేశారు. 

స్టాఫ్ నర్సులకు ప్రతి నెల రూ. 23, 500 చెల్లించాలి. అయితే నేషనల్ హెల్త్ మిషన్ కిం పనిచేస్తున్న నర్సులకు మాత్రమే ఈ వేతనాలను చెల్లిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద పనిచేయని నర్సులకు ప్రతి నెల కేవలం రూ. 17,500 చెల్లిస్తున్నట్టుగా వారు చెప్పారు.

పారిశుద్య కార్మికులకు రూ. 7500 ఇన్సెంటివ్ ను ప్రభుత్వం ప్రకటించిందన్నారు,. తమకు కేవలం 10 శాతం మాత్రమే ఇన్సెంటివ్ ను ప్రకటించడంపై  కూడ నర్సులు పెదవి విరుస్తున్నారు.
also read:లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘనలు: ఎల్బీనగర్ డీ మార్ట్ సీజ్

అవుట్ సోర్సింగ్ పద్దతిలో పనిచేస్తున్న 200 మంది నర్సులు కాకుండా, మరో 150 మంది స్టాఫన్ నర్సులు పనిచేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న నర్సులు సమ్మెకు దిగితే ఇబ్బందులు తప్పకపోవచ్చనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
 
click me!