modi hyderabad visit : ఆదివారం రాత్రి రాజ్‌భవన్ లోనే మోడీ బస : క్లారిటీ ఇచ్చిన సీపీ ఆనంద్

By Siva KodatiFirst Published Jul 1, 2022, 2:31 PM IST
Highlights

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ కు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఆదివారం పరేడ్ గ్రౌండ్స్ లో సభ ముగిసిన తర్వాత ఆయన బసపై గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ క్లారిటీ ఇచ్చారు. 

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో (bjp national executive meeting) పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ (modi hyderabad visit schedule) రేపు హైదరాబాద్ వస్తున్న సంగతి తెలిసిందే. తొలి రోజు (శనివారం) నోవాటెల్ హోటల్ లోనే ప్రధాని బస చేయనుండగా.. ఆదివారం మోడీ బస ఎక్కడ అన్న దానిపై క్లారిటీ లేదు. రాజ్ భవన్ (raj bhavan) లేదా నోవాటెల్ లో ఆయన బస చేస్తారని షెడ్యూల్ లో వివరించారు. అయితే దీనిపై హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ (hyderabad police commissioner) సీవీ ఆనంద్ క్లారిటీ ఇచ్చారు. పరేడ్ గ్రౌండ్ సభ తర్వాత రాజ్ భవన్ లోనే మోడీ బస చేస్తారని సీపీ వివరించారు. 

శుక్రవారం బీజేపీ నేతలతో కలిసి ఆయన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ను పరిశీలించిన సీవీ ఆనంద్... భద్రతా ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ.. ప్రధాని బస సందర్భంగా రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. హెచ్ఐసీసీ, బేగంపేట, రాజ్ భవన్ మార్గాల్లో దాదాపు 4 వేల పోలీసులతో పహారా ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. వీఐపీలు ఎక్కవమంది వస్తున్న నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. 

ALso REad:హైద్రాబాద్‌కు బీజేపీ అగ్రనేతల రాక: ఈ నెల 2,3 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు

 

పరేడ్ గ్రౌండ్స్ లో లక్షమంది వరకు కూర్చొనేందుకు ఏర్పాట్లు చేసినట్లు సీపీ తెలిపారు. కంటోన్మెంట్, జీహెచ్ఎంసీ ఏరియాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశామని సీవీ ఆనంద్ వెల్లడించారు. ట్రాఫిక్ కంట్రోల్ కోసం జిల్లాల నుంచి అధికారులను రప్పిస్తున్నట్లు కమీషనర్ వెల్లడించారు. పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో 3వేల మందితో సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆక్టోపస్, గ్రేహౌండ్స్, సిటీ పోలీసులు భద్రత విధుల్లో పాల్గొంటారని సీపీ పేర్కొన్నారు. సెక్టార్ ఇన్ ఛార్జులుగా డీఐజీ, ఎస్పీ, ఏసీపీ స్థాయి అధికారులు వుంటారని సీవీ ఆనంద్ తెలిపారు. 

మరోవైపు.. తెలంగాణ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధం అయ్యింది. రేపు, ఎల్లుండి జరిగే సమావేశాలకు కమలనాథులు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌ నగరాన్ని బీజేపీ జెండాలు, ఫ్లెక్సీలు, కటౌట్లు, బోర్డులతో నింపేశారు.  దాదాపు 18 ఏళ్ల తర్వాత బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్‌ వేదికవుతోంది.  రాజకీయ, ఆర్థిక తీర్మానాలతోపాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై  జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించనున్నారు. ఈ నెల 3న జాతీయ కార్యవర్గసమావేశాల ముగింపును పురస్కరించుకొని  సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు కనీసం 10 లక్షల మందిని తరలించాలని కూడా బీజేపీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది.
 

click me!