బహిరంగ ప్రదేశాల్లో మాస్క్.. వారం ఛాన్స్, మారకపోతే భారీ ఫైన్: హైదరాబాద్ సీపీ హెచ్చరిక

By Siva KodatiFirst Published Mar 30, 2021, 2:31 PM IST
Highlights

బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి అన్నారు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. వారం రోజుల పాటు జనాల్లో చైతన్యం కల్పిస్తామని తెలిపారు. వారం తర్వాత కూడా మాస్క్‌లు వాడకపోతే ఫైన్లు విధిస్తామని అంజనీకుమార్ హెచ్చరించారు. 

కాగా, రాష్ట్రంలో కరోనా మహమ్మారి మళ్లీ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే బహిరంగ ప్రదేశాల్లో సంచరించేవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని నిబంధన విధించింది.

అయితే దీనిపై ప్రజల్లో మార్పు కనిపించకపోవడంతో అధికార యంత్రాంగం కఠినచర్యలు పూనుకుంటోంది. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించే వారికి వెయ్యి రూపాయలకు తగ్గకుండా జరిమానా విధించడంతో పాటు రెండేళ్ల జైలుశిక్ష పడేలా చట్టాలను అమలు చేయాలని నిర్ణయించింది.

ఈ మేరకు  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. మాస్క్‌ లేకుండా బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేవారిపై డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ చట్టం-2005లోని సెక్షన్‌ 51 నుంచి 60 కింద, ఐపీసీ సెక్షన్‌ 188 కింద చర్యలు తీసుకోవాలని సూచిస్తూ కలెక్టర్లు, మేజిస్ట్రేట్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలను సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు

click me!