
హైదరాబాద్ నగరంలోని కంచన్‌బాగ్ పోలీసు స్టేషన్ పరిధిలో సట్టా బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. వారి వద్ద నుంచి రూ.35,580 నగదు, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సట్టా బెట్టింగ్‌కు సంబంధించి ప్రధాన నిందితుడు మొహమ్మద్ అజ్మత్ అలీని పోలీసులు అరెస్ట్ చేశారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో నిందితుడు సట్టా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు.
కూరగాయల విక్రయదారులు, హోటల్ కార్మికులు మొదలైన వారిని లక్ష్యంగా చేసుకుని.. వారితో ఈ గేమ్ ఆడటం ద్వారా నిందితుడు మొహమ్మద్ అజ్మత్ సులభంగా డబ్బు సంపాదిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇక, కొన్ని వారాల క్రితం నగరంలోని సంతోష్‌నగర్‌లోని ఓ ఇంటిలో నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర ‘సట్టా బెట్టింగ్’ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకుని.. రూ.25,710 స్వాధీనం చేసుకున్నారు. సంతోష్‌నగర్‌కు చెందిన మహ్మద్ సిరాజ్.. స్థానికంగా ఈ దందా కొనసాగిస్తున్నాడు. అతడు మహారాష్ట్రకు చెందిన ప్రధాన నిర్వాహకుడు ఇక్బాల్ షేక్‌తో టచ్‌లో ఉంటూ ఆన్‌లైన్‌లో నగదు బదిలీ చేస్తున్నాడు. రోజువారీ కూలీలు, ఆటో డ్రైవర్లు, పండ్ల వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులు సట్టా బెట్టింగ్‌లో పాల్గొంటున్నారని పోలీసులు తెలిపారు.