హైద్రాబాద్ జూబ్లీహిల్స్‌లో డ్రగ్స్ సీజ్, ఇద్దరు అరెస్ట్: సెక్స్ వర్కర్లకు చేరవేస్తున్న ముఠా

By narsimha lode  |  First Published Sep 4, 2023, 3:14 PM IST

హైద్రాబాద్ నగరంలోని  జూబ్లీహిల్స్ లో  డ్రగ్స్ ను వెస్ట్ జోన్ పోలీసులు ఇవాళ స్వాధీనం చేసుకున్నారు.  సెక్స్ వర్కర్లకు  ఈ ముఠా డ్రగ్స్ సరఫరా చేస్తుందని  పోలీసులు గుర్తించారు.


హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ లో 210 గ్రాముల ఎండీఎంఏను  వెస్ట్ జోన్  పోలీసులు సోమవారంనాడు పట్టుకున్నారు. సెక్స్ వర్కర్లకు  ఈ ముఠా  డ్రగ్స్ సరఫరా చేస్తుందని  పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల హైద్రాబాద్ లో అరెస్టైన మాదాపూర్ డ్రగ్స్ కేసు నిందితులతో ఈ ముఠా సభ్యులకు సంబంధాలున్నాయనే   పోలీసులు గుర్తించారు. ఇవాళ అరెస్టైన ఇద్దరిలో  ఒకరు రాజస్థాన్ రాష్ట్రంలో  హోంగార్డుగా పనిచేస్తున్నట్టుగా  పోలీసులు తెలిపారు.

 ఈ ఏడాది ఆగస్టు 31న హైద్రాబాద్ మాదాపూర్ లో  ఓ అపార్ట్ మెంట్ లో  రేవ్ పార్టీ జరుగుతుందని  సమాచారం ఆధారంగా పోలీసులు దాడి చేశారు.  ఈ అపార్ట్ మెంట్ నుండి భారీగా డ్రగ్స్ ను సీజ్ చేశారు.  సినీ ఫైనాన్షియర్  వెంకట్, బాలాజీ  సహా మరికొందరిని పోలీసులు అరెస్ట్  చేశారు.ఈ ముఠాతో  ఇవాళ అరెస్టైన వారికి కూడ లింకులున్నట్టుగా  పోలీసులు గుర్తించారు.

Latest Videos

రాజస్థాన్ కు చెందిన  హోంగార్డు  వీరేందర్ తో పాటు ఆయన సహయకుడిని  పోలీసులు  చెప్పారు. చెక్ పోస్టుల నుండి డ్రగ్స్ ను  వీరేందర్  దాటించేవాడు.  హైద్రాబాద్ తో పాటు  ఇతర రాష్ట్రాల్లో డ్రగ్స్ అవసరమైన వారి జాబితాను సిద్దం  చేసుకొని వారికి అందించేవాడని పోలీసులు  చెప్పారు. 

also read:మాదాపూర్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్: సినీ నిర్మాతలకే వెంకట్ టోకరా, పెళ్లి మోసం కూడా..

గతంలో కూడ హైద్రాబాద్ నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తూ  పలువురు  పట్టుబడ్డారు.  సైబర్ క్రైమ్ విభాగంలో ఎస్ఐగా పనిచేస్తున్న రాజేందర్  ఇంట్లో పోలీసులు డ్రగ్స్ ను సీజ్ చేశారు.ఈ ఏడాది ఆగస్టు  27న ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్ఐను అరెస్ట్  చేసి రిమాండ్ కు తరలించారు. హైద్రాబాద్ ఫిల్మ్ నగర్ లో  డ్రగ్స్ విక్రయిస్తున్న  నైజీరియన్ ను ఈ ఏడాది ఆగస్టు  17న పోలీసులు  అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి రూ. 11 లక్షల విలువైన  డ్రగ్స్ ను పోలీసులు సీజ్ చేశారు.ఈ ఏడాది జూన్  24న  రాజేంద్రనగర్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు..ఈ ఏడాది జూలై 8న  భారీగా కొకైన్ ను పోలీసులు సీజ్ చేశారు.ఈ కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్  చేశారు.  నిందితుల నుండి  100 గ్రాముల  కొకైన్, 300 గ్రాముల ఎండీఎంఏను సీజ్ చేశారు.వీటి విలువ కోటి రూపాయాలుంటుందని  అధికారులు చెబుతున్నారు.


 

click me!