విశాఖ నుండి మహారాష్ట్రకు గంజాయి సరఫరా: హైద్రాబాద్‌లో ముగ్గురు అరెస్ట్

Published : Jul 01, 2023, 05:20 PM ISTUpdated : Jul 01, 2023, 05:22 PM IST
విశాఖ నుండి  మహారాష్ట్రకు  గంజాయి  సరఫరా: హైద్రాబాద్‌లో ముగ్గురు అరెస్ట్

సారాంశం

హైద్రాబాద్ రాజేంద్రనగర్ లో కారులో  గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్  చేశారు. విశాఖ నుండి మహారాష్ట్రకు  గంజాయి తరలిస్తున్న సమయంలో అరెస్ట్ చేశారు. 

హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ ఔటర్ రింగ్  వద్ద కారులో  గంజాయి తరలిస్తున్న ముగ్గురిని  శనివారం నాడు పోలీసులు అరెస్ట్  చేశారు. నిందితుల నుండి సెల్ ఫోన్లను, కారును  పోలీసులు సీజ్ చేశారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణం నుండి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తుండగా  పోలీసులు పట్టుకున్నారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో గంజాయి తరలిస్తున్న పలువురిని పోలీసులు అరెస్ట్  చేస్తున్న ఘటనలు  అనేకం నమోదౌతున్నాయి.  రెండు రాష్ట్రాల్లో గంజాయిపై  పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నా  గంజాయి తరలిస్తూ  పలువురు  పోలీసులకు చిక్కుతున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాలో  కారు డిక్కీలో  గంజాయిని తరలిస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు. మరో వాహనంలో ఉల్లిగడ్డల బస్తాల కింద  225 కిలోల గంజాయిని కూడ పోలీసులు  ఈ ఏడాది జూన్  27న  చోటు చేసుకుంది. హైద్రాబాద్ లో గంజాయిని విక్రయిస్తున్న పానీపూరి వ్యాపారిని  పోలీసులు గత నెల  7వ  తేదీన అరెస్ట్  చేశారు.  

పుష్ప సినిమా తరహలోనే  బొలోరే వాహనంలో గంజాయిని తరలిస్తున్న  నిందితులను  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి పోలీసులు జూన్  ఐదో తేదీన  అరెస్ట్  చేశారు. 240 కిలోల గంజాయిని పోలీసులు సీజ్  చేశారు. బొలేరో వాహనంలో  ప్రత్యేకంగా అరను  ఏర్పాటు  చేశారు. అందులో గంజాయిని తరలిస్తున్నారు. కృష్ణా జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న  22 మందిని  విజయవాడ పోలీసులు  ఈ ఏడాది ఏప్రిల్  4వ తేదీన  అరెస్ట్  చేశారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి  ముంబైకి  గంజాయిని తరలిస్తున్న నిందితులను  హైద్రాబాద్ హయత్ నగర్ పోలీసులు  ఈ ఏడాది మార్చి 16న చోటు  చేసుకుంది.  నిందితుల నుండి  స్వాధీనం చేసుకున్న  గంజాయి విలువ రూ. 70 లక్షలుగా ఉంటుందని పోలీసులు ప్రకటించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?