మరోసారి బీజేపీ నేత జితేందర్ రెడ్డి ట్వీట్: రఘునందన్ రావుకు మద్దతు

By narsimha lode  |  First Published Jul 1, 2023, 4:32 PM IST

మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి  ట్విట్టర్ వేదికగా మరోసారి స్పందించారు.  రఘునందన్ రావుకు  జితేందర్ రెడ్డి మద్దతు ప్రకటించారు. 


హైదరాబాద్: దుబ్బాక ఎమ్మెల్యే  రఘునందన్ రావును బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి చేయాలనే డిమాండ్ కు తాను మద్దతిస్తున్నానని  మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి  ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా జితేందర్ ఈ వ్యాఖ్యలు  చేశారు. 

బీజేపీ నాయకత్వంపై  రఘునందన్ రావు కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్నారు. బీజేపీ శాసనసభపక్ష పదవిని రఘునందన్ రావు ఆశిస్తున్నారనే  ప్రచారం సాగుతుంది.   బీజేపీ శాసనససభ పక్ష నేతగా ఉన్న రాజాసింగ్  పై  బీజేపీ నాయకత్వం  సస్పెన్షన్ వేటు  వేసింది.  దీంతో  బీజేపీ శాసనసభపక్ష నేతను  పార్టీ ఇంకా నియమించలేదు. మరోవైపు రాజాసింగ్ పై  సస్పెన్షన్ ను కూడ ఎత్తివేయలేదు.

Latest Videos

undefined

also read:బండి సంజయ్‌ని తప్పిస్తే చేరికలుండవు: బీజేపీ నేత విజయరామారావు సంచలనం

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత  బీజేపీ గ్రాఫ్ పెరిగిందని  రఘునందన్ రావు  అభిప్రాయంతో ఉన్నారు.  గత కొంతకాలంగా తెలంగాణ బీజేపీలో ఒకరిపై  మరోకరు పరోక్షంగా విమర్శలు, ఆరోపణలు  చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. బండి సంజయ్ ను  పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పించాలని  కొందరు  నేతలు  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా,  కేంద్ర మంత్రి అమిత్ షా ను  కలిసి  మార్చాలని కోరినట్టుగా ప్రచారం సాగుతుంది.  అయితే  బండి సంజయ్ ను  మార్చబోమని  పార్టీ నాయకత్వం తేల్చి చెప్పినట్టుగా  పార్టీ వర్గాల్లో  ప్రచారంలో ఉంది.

 

Proud of your voice. I support you as national spokesperson ⁦⁩ ⁦⁩ ⁦⁩ ⁦⁩ pic.twitter.com/3Cvafg7dAn

— AP Jithender Reddy (@apjithender)

ఇటీవలనే  ఓ జంతువును  కాలితో తన్నుతూ  ట్రాలీలో ఎక్కించిన వీడియోను  జితేందర్ రెడ్డి పోస్టు  చేశారు.  బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుండి తప్పించాలని కోరుతున్న నేతలనుద్దేశించి  ఈ పోస్టు పెట్టినట్టుగా  జితేందర్ రెడ్డి వివరణ  ఇచ్చారు. ఈ పోస్టు తర్వాత  రఘునందన్ రావుకు  మద్దతుగా  జితేందర్ రెడ్డి  ట్విట్టర్ వేదికగా  పోస్టు  చేశారు.

click me!