లీటర్ హా ష్ ఆయిల్‌కి రూ. 6 లక్షలు: విశాఖ నుండే లక్ష్మీపతి కొనుగోలు

Published : Apr 06, 2022, 04:00 PM ISTUpdated : Apr 06, 2022, 04:26 PM IST
లీటర్ హా ష్ ఆయిల్‌కి రూ. 6 లక్షలు: విశాఖ నుండే లక్ష్మీపతి కొనుగోలు

సారాంశం

దేశంలోని పలు ప్రాంతాల్లో లక్ష్మీపతికి పెడ్లర్లున్నారని నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ డీసీపీ చక్రవర్తి చెప్పారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. బీటెక్ స్టూడెంట్ ఇటీవల మరణించడానికి లక్ష్మీపతి ప్రధాన కారణమని ఆయన వివరించారు.

హైదరాబాద్: Drugs అధిక మోతాదులో తీసుకొని ఇటీవల మరణించిన B.Tech విద్యార్ధి కేసులో Laxmipatiతో పాటు మదన్ మానేకర్ ముఠాను అరెస్ట్ చేసినట్టుగా నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ డీసీపీ చక్రవర్తి చెప్పారు.

బుధవారం నాడు Narcotics Enforcement Wing డీసీపీ Chakravarti హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. లక్ష్మీపతి విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో నివాసం ఉంటున్న Nagesh అనే వ్యక్తి నుండి Hash oil ను కొనుగోలు చేస్తున్నారని చక్రవర్తి చెప్పారు. ఇప్పటివరకు లక్ష్మీపతికి ఆరు కేసుల్లో ప్రమేయం ఉందని తమ దర్యాప్తులో తేలిందని డీసీసీ చెప్పారు. 

దేశ వ్యాప్తంగా డ్రగ్ సప్లయర్స్ తో లక్ష్మీపతికి సంబంధాలున్నాయన్నారు.  బీటెక్ విద్యార్ధి మృతి కేసులో కీలక సూత్రధారిగా చెప్పారు. బీటెక్ విద్యార్ధి మృతి కేసులో 9 మంది అరెస్ట్ చేశామన్నారు.  లక్ష్మీపతి నుండి నేరుగా కొందరు డ్రగ్స్ ను కొనుగోలు చేసే పెడ్లర్లున్నారని డీసీపీ వివరించారు.  లక్ష్మీపతితో పాటు ఇతర Drugs సరఫరా దారుల వద్ద వినియోగదారులుగా ఉన్న 9 మందిని గుర్తించామన్నారు. వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టుగా DCP చెప్పారు. 

Visakhapatnam కు చెందిన నగేష్ వద్ద హాష్ ఆయిల్ ను కొనుగోలు చేసి లక్ష్మీపతి Hyderabadలో సరఫరా చేస్తారన్నారు. ఐదు గ్రాముల హాష్ ఆయిల్ కు రూ. 3 వేలకు విక్రయిస్తారన్నారు. లీటర్ హాష్ ఆయిల్ ను రూ. 6 లక్షలకు  విక్రయిస్తారని డీసీపీ వివరించారు.హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో లక్ష్మీపతికి నెట్ వర్క్ ఉందని  పోలీసులు చెప్పారు. లక్ష్మీపతిపై నల్లకుంట, గోల్కొండ, అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయని డీసీపీ చెప్పారు.లక్ష్మీపతి మణికొండతో ఉంటూ డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నారని డీసీపీ చెప్పారు. గోవా నుండి సింథటిక్ డ్రగ్స్ వస్తున్నాయన్నారు. 

తమిళనాడు, ఒడిశా,డిల్లీ, కర్ణాటక, కేరళ, ముంబై, యూపీ, బీహార్‌లలో కూడా విశాఖ జిల్లాకు చెందిన నగేష్ కు పెడ్లర్లున్నారని డీసీపీ తెలిపారు. ఇక మదన్ మానేకర్ హాష ఆయిల్  సరఫరా చేస్తూ పట్టుబడ్డాడని డీసీపీ చెప్పారు. రెండు కేసుల్లో మదన్ కు సంబంధం ఉందన్నారు.  మదన్ కు 9 మంది వినియోగదారులున్నారు. నిందితుడి నుండి 120 హాష్ ఆయిల్ సీజ్ చేశారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?