ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం:హైద్రాబాద్‌లో ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Published : Oct 25, 2022, 12:06 PM IST
ఐటీ,  ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం:హైద్రాబాద్‌లో ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్

సారాంశం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న ముఠాను హైద్రాబాద్ పోలీసులు మంగళవారంనాడు అరెస్ట్  చేశారు. నిందితులు హైద్రాబాద్ లో ట్రైనింగ్ సెంటర్ ను  కూడ ఏర్పాటు చేశారు.

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న ముఠాను మంగళవారంనాడు హైద్రాబాద్ పోలీసులుఅరెస్ట్ చేశారు..కేంద్రప్రభుత్వ ఉద్యోగాలతో పాటు,ఐటీ ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసినట్టుగా పోలీసులు చెప్పారు. ఈ మోసానికి పాల్పడిన ఐదుగురు సభ్యుల ముఠాను హైద్రాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్  పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితుల నుండి 70 కంప్యూటర్లు ,భారీగా  బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు హైద్రాబాద్ లో ట్రైనింగ్ సెంటర్ ను కూడా  ఏర్పాటు  చేశారని పోలీసులు గుర్తించారు. కేంద్ర  ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని నిందితులు  నిరుద్యోగులకు  ఁఈ ట్రైనింగ్ సెంటర్ లో ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు.ఈ సెంటర్ నుండి నకిలీ అపాయింట్ మెంట్ లెటర్లను పోలీసులు  స్వాధీనం  చేసుకున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Mangli Contrevercy: మంగ్లీ కేసులో సిఐడి దూకుడు.. అసలు ఏమిటీ స్కాం..? | Asianet News Telugu
Alcohol : మగువలు మందుకొట్టే టాప్ 7 రాష్ట్రాలివే.. తెలంగాణ స్థానమెంత..?