మునుగోడు బై పోల్: జ్వరంతో బాధపడుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఈ రోజు ప్రచారానికి దూరం..!

By Sumanth KanukulaFirst Published Oct 25, 2022, 11:20 AM IST
Highlights

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్ది ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. అయితే ఈ సమయంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనారోగ్యం బారిన పడ్డారు. 

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్ది ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. అయితే ఈ సమయంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనారోగ్యం బారిన పడ్డారు. రాజగోపాల్ రెడ్డి జ్వరంతో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఆయన ఈరోజు ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎన్టీవీ న్యూస్ చానెల్ రిపోర్ట్ చేసింది. షెడ్యూల్ ప్రకారం రాజగోపాల్ రెడ్డి ఈరోజు మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉంది. అయితే జర్వం కారణంగా తన ప్రచారాన్ని రాజగోపాల్ రెడ్డి రద్దు చేసుకున్నారు. అయితే బీజేపీ ముఖ్య నేతలు మాత్రం రాజగోపాల్ రెడ్డి తరఫున నియోజకవర్గంలో ప్రచారాన్ని కొనసాగించనున్నారు. 

ఇదిలా ఉంటే.. సోమవారం మునుగోడు నియోజకవర్గం సంస్థాన్  నారాయణ్ పూర్ మండలం వెంకం భావి తండాలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  దంపతులు గిరిజనుల మధ్య  దీపావళి వేడుకలు జరుపుకున్నారు. గిరిజన సంప్రదాయ దుస్తుల్లో రాజగోపాల్ రెడ్డి దంపతులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.  

ఇక, మునుగోడులో భారీ బహిరంగ సభతో ఉప ఎన్నిక ప్రచారాన్ని ముగించాలని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 31న మునుగోడు పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తుంది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇద్దరు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. 

click me!