మొండెం లేని తల కేసు: ఎర్రం అనురాధను హత్య చేసిన చంద్రమౌళి అరెస్ట్

By narsimha lode  |  First Published May 24, 2023, 4:39 PM IST

ఎర్రం అనురాధ అనే మహిళను అత్యంత  దారుణంగా హత్య  చేసిన  చంద్రమౌళిని  పోలీసులు అరెస్ట్  చేశారు.  
 



హైదరాబాద్:  నగరంలోని  మలక్ పేట తీగలగూడ వద్ద  మొండెం లేని  మహిళ  తల  కేసులో  పోలీసులు  కేసు రీ కన్  స్ట్రక్షన్  చేస్తున్నారు.  ఈ నెల  17న మలక్ పేటలోని మూసీ  పరివాహక ప్రాంతంలో  నల్ల  కవర్లో  మహిళ  తల లభ్యమైంది.    ఈ విషయాన్ని గుర్తించిన  స్థానికులు  పోలీసులకు సమాచారం  ఇచ్చారు.  మొండెం లేని తల కేసులో  పోలీసులు ప్రత్యేక  బృందాలుగా  ఏర్పడి  విచారణ  నిర్వహించారు.  మృతురాలిని  ఎర్రం అనురాధగా  గుర్తించారు. 

ఎర్రం అనురాధ చైత్యపురిలోని చంద్రమౌళి నివాసంలో  అద్దెకు ఉంటుంది.  అనురాధ  ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో  నర్సుగా  పనిచేస్తుంది.  ఎర్రం అనురాధ  వడ్డీ వ్యాపారం  కూడా  చేస్తుందని  పోలీసులు తమ దర్యాప్తులో  గుర్తించారు. తాను అద్దెకు ఉంటున్న  ఇంటి యజమాని చంద్రమోళికి  కూడా  ఎర్రం అనురాధ  రూ. 6 లక్షలు అప్పుగా  ఇచ్చింది.  ఈ డబ్బుల విషయమై   అనురాధకు  చంద్రమోళికి  మధ్య  గొడవ  జరిగింది.   దీంతో  అనురాధను  చంద్రమోళి హత్య  చేశాడు.  అనురాధ  శరీర భాగాలను  కోసి  ఫ్రిజ్ లో  పెట్టారు.

Latest Videos

undefined

also read:హైద్రాబాద్ మలక్‌పేటలో కలకలం: మొండెం లేని మహిళ తల లభ్యం

 మృతురాలి తల  ఫోటోను  బంధువులు  గుర్తించారు.  బంధువులు  ఇచ్చిన సమాచారంతో  అనురాధ  నివాసం ఉండే  ఇంటికి వెళ్లారు. అయితే  అనురాధను  హత్య  చేసిన  తర్వాత  చంద్రమౌళి పారిపోయాడు.అనురాధ  శరీర భాగాలు  ఫ్రిజ్ లో దాచి పెట్టిన తర్వాత  దుర్వాసన రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు.

also read:వీడిన చాదర్‌ఘాట్‌ ‘‘ మొండెం లేని తల ’’ మిస్టరీ.. నర్సును ముక్కలు చేసి, ఫ్రిజ్‌లో డెడ్ బాడీ

ఇవాళ  మధ్యాహ్నం  చైతన్యపురిలో  నిందితుడి  నివాసం వద్ద  పోలీసులు సీన్ రీ కన్ స్ట్రక్షన్   చేశారు. అనురాధ ను తాను  ఒక్కడినే  హత్య  చేసినట్టుగా  చంద్రమౌళి పోలీసులకు  చెప్పారని   సమాచారం.చంద్రమౌళి  నివాసంలోని  ఫ్రిజ్ నుండి  అనురాధ  మిగిలిన శరీర బాగాలను  పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

click me!