నలుగురు ఆడపిల్లలే పుట్టారని హైద్రాబద్ లో బాసిత్ అలీఖాన్ అనే వ్యక్తి మూడేళ్ల చిన్నారిని నేలకేసి కొట్టాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి ఇవాళ మృతి చెందింది. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: నలుగురు ఆడపిల్లలే పుట్టారనే కోపంతో Hyderabad లో బాసిత్ ఆలీఖాన్ అనే ఆటోడ్రైవర్ మూడేళ్ల చిన్నారిపై విచక్షణరహితంగా దాడికి దిగాడు. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ చిన్నారి మరణించింది. ఈ ఘటనపై మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు Basith Alikhan ను అరెస్ట్ చేశారు.
హైద్రాబాద్ నగరంలోని Saifabad కు చెందిన బాసిత్ అలీఖాన్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. బాసిత్ అలీఖాన్ ఎనిమిదేళ్ల క్రితం సనా ఫాతిమాను వివాహం చేసుకొన్నాడు. వీరికి నలుగురు పిల్లలు. ఈ నలుగురూ కూడా అమ్మాయిలే. సనా ఫాతిమా ప్రస్తుతం గర్భవతి. నాలుగు రోజుల క్రితం మూడేళ్ల చిన్నారి ఇంట్లో ఆడుకుంటుంది. ఈ సమయంలో బాలికను తల్లి పిలిచింది. కానీ ఆ బాలిక రాలేదు. అయితే అదే సమయంలో అక్కడే ఉన్న బాసిత్ అలీఖాన్ కోపంతో బాలికపై విచక్షణ రహితంగా దాడికి దిగాడు.
undefined
నలుగురు ఆడపిల్లలే పుట్టారనే కోపం కూడా అతనికి ఉంది. దీంతో ఆ బాలికను నేలకేసి కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారిని ఆసుపత్రిలో చేర్పించింది నాలుగు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి బుధవారం నాడు మృతి చెందినట్టుగా వైద్యులు ప్రకటించారు. చిన్నారి తల్లి సనా ఫాతిమా ఫిర్యాదు మేరకు పోలీసులు బాసిత్ అలీఖాన్ ను అరెస్ట్ చేశారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ కథనం ప్రసారం చేసింది. ఆడపిల్లలు పుట్టారనే అక్కసుతోనే నిందితుడు ఈ దాడికి పాల్పడినట్టుగా మృతురాలి తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొందని ఈ కథనం తెలిపింది.
ఆడపిల్ల పుట్టడంతో నిందితుడు ఈ దారుణానికి పాల్పడడం పట్ల మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆడపిల్లలు అనే కారణంగానే బాసిత్ అలీఖాన్ చాలా కాలంగా అసంతృప్తిగా ఉన్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.