హైద్రాబాద్ జూబ్లీహిల్స్‌లో 13 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్: భారీగా నగదు స్వాధీనం

By narsimha lodeFirst Published Sep 6, 2022, 2:24 PM IST
Highlights


హైద్రాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ లోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. 

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ లో ని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న 13 మందిని పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. పేకాట ఆడుతున్న వారి నుండి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ లోని బొల్లినేని బలరామయ్య నివాసంలో పేకాట ఆడుతున్నట్టుగా పోలీసులకు కచ్చితమైన సమాచారం అందింది.ఈ సమాచారం ఆధారంగా పోలీసులు ఈ ఇంటిపై  ఇవాళ దాడి చేశారు. ఈ సమయంలో బలరామయ్య ఇంట్లో పేకాట ఆడుతున్న 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారని ప్రముఖ తెలుగు న్యూస్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. 

తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేకాట క్లబ్ లు మూసివేశారు. ప్రభుత్వ నిర్ణయం తో  చాటుమాటుగా అక్కడక్కడ పేకాట నిర్వహిస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. హైద్రాబాద్ శివార్లలోని ఫామ్ హౌస్ లను కేంద్రంగా చేసుకుని పేకాట నిర్వహించిన వారిని పోలీసులు గతంలో అరెస్ట్ చేశారు.ఫామ్ హౌస్ లతో పాటు స్టార్ హోటల్స్ ను అద్దెకు తీసుకొని పేకాట నిర్వహించిన వారిపై గతంలోనే తెలంగాణ పోలీసులు కేసులునమోదు చేశారు. నగరంలోని చీకోటి ప్రవీణ్ కుమార్ కేసినో నిర్వహిస్తానని ఒప్పుకొన్నాడు. గోవాతో పాటు ఏ దేశాల్లో కేసీనోకు అనుమతి ఉందో అక్కడ కేసీనో నిర్వహిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. చీకోటి ప్రవీణ్  తో పాటు ఆయన అనుచరుల ఇళ్లపై కూడా ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఈడీ అధికారుల విచారణకు కూడా చీకోటి ప్రవీణ్ హాజరయ్యాారు. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
 

click me!