మూడు రోజులే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు: బీఏసీలో నిర్ణయం

By narsimha lode  |  First Published Sep 6, 2022, 1:13 PM IST


ఇవాళ్టితో కలిపి మూడు రోజుల పాటు  తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈనెల 12, 13 తేదీల్లో అసెంబ్లీ సమావేఁశాలు జరగనున్నాయి.


హైదరాబాద్ మూడు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం నాడు అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం జరిగింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అద్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ, తెలంగాణ రాష్ట్ర శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలకు ఆహ్వానం  రాలేదని సమాచారం. బీఏసీ సమావేశంలో.మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ్టితో పాటు ఈ నెల 12, 13 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలిపింది అసెంబ్లీ. మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలిపిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడింది. ఈ నెల 12న అసెంబ్లీ తిరిగి ప్రారంభం కానుంది.,

Latest Videos

undefined

also read:ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు: మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం, వాయిదా

ఈ నెల 13వ తేదీన అసెంబ్లీ పని చేయనుంది. అయితే  అసెంబ్లీని కనీసం 20 రోజుల పాటు సమావేశపర్చాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది.  ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ కూడా కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచారు. 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కోరారు. జాతీయ సమైక్యత వేడుకల దృష్ట్యా ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వం తెలిపింది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాల ఏడాదికి కనీసం 80 రోజుల పాటు నిర్వహించిన సందర్భం ఉందని బీజేపీ ఎమ్మెల్యేలు గుర్తు చేస్తున్నారు.

click me!