బోయిన్‌పల్లి కిడ్నాప్: తెరపైకి భూమా జగత్ విఖ్యాత్ పేరు, గాలింపు

By narsimha lodeFirst Published Jan 15, 2021, 1:33 PM IST
Highlights

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో  ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి పేరును కూడ పోలీసులు చేర్చారు.


హైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో  ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి పేరును కూడ పోలీసులు చేర్చారు.

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ  మూడు రోజుల పోలీస్ కస్టడీ పూర్తి కావడంతో గురువారం నాడు మధ్యాహ్నం పోలీసులు ఆమెను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. దీంతో ఆమెకు 14 రోజుల పాటు జ్యూడీషీయల్ రిమాండ్ కు తరలించారు.

కస్టడీ రిపోర్టులో పోలీసులు అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి పేరును కూడ చేర్చారు.   అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ఆయన సోదరుడు చంద్రహాస్ తో పాటు భార్గవ్ రామ్ కుటుంబాన్ని మొత్తం ఈ కేసులో చేర్చారు పోలీసులు.
 
భార్గవ్ రామ్, చంద్రహాస్, గుంటూరు శ్రీను, జగత్ విఖ్యాత్ రెడ్డిల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కిడ్నాప్ కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేశారు.  మిగిలినవారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సుమారు 15 మంది పోలీసు బృందం వీరి కోసం గాలిస్తున్నారు.

also read:బోయిన్‌పల్లి కిడ్నాప్: ముగిసిన అఖిలప్రియ పోలీస్ కస్టడీ, 14 రోజుల రిమాండ్

జగత్ విఖ్యాత్ రెడ్డి కారు డ్రైవర్ ద్వారా ఈ కేసులో అతనికి ప్రమేయం ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఆయన కోసం గాలిస్తున్నారు.కర్ణాటక రాష్ట్రంలో జగత్ విఖ్యాత్ రెడ్డి తదితరులు ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఈ నెల 5వ తేదీ రాత్రి బోయిన్ పల్లిలో ప్రవీణ్ రావు ఆయన ఇద్దరు సోదరులను కిడ్నాప్ చేశారు.ఈ కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్టయ్యారు.

click me!