శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వెళ్ళే దారిలో స్పీడ్ గన్స్..

By AN TeluguFirst Published Jan 15, 2021, 12:29 PM IST
Highlights

ఫ్లైట్ మిస్సవుతుందని కారు స్పీడ్ పెంచారో.. అంతే.. స్పీడ్ గన్ మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది. రోడ్డు ఖాళీగా ఉంది కదా అని రయ్యిమంటూ దూసుకెళ్లారనుకోండీ.. స్పీడ్ గన్ బ్రేక్ వేస్తుంది.  హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ దారిలో వెళ్లే వాహనదారులూ తస్మాత్ జాగ్రత్త.. అడ్డుగడుగునా స్పీడ్ గన్ మీ కోసం కాచుకోబోతోంది.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వెళ్ళే ప్రధాన దారిలో వేగంగా వెళ్లే వాహనాలకు కళ్లెం వేయడానికి అధికారులు స్పీడ్ గన్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఎయిర్ పోర్ట్ ప్రధాన రహదారిలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపధ్యంలో, ప్రమాదాల నివారణ కోసం స్పీడ్ గన్ లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.

ఇక నుంచి ఎయిర్ పోర్ట్ ప్రధాన రహదారిపైన 60 కిమీ కన్నా ఎక్కువ స్పీడ్ గా వెళ్లారంటే ఫైన్ పడుతుంది. బెంగుళూరు జాతీయ రహదారిని అనుకుని ఉండడంతో పాటు హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారికి అనుసంధానంగా ఉండడం వల్ల ఎయిర్ పోర్ట్ రోడ్ చాలా రద్దీగా ఉంటుంది. 

దీంతో వాహనాలు మితిమీరిన వేగంతో వెళ్లకుండా స్పీడ్ గన్ లను ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అధికారులు ఏర్పాటు చేసిన స్పీడ్ గన్ లు వాహనాల మితిమీరిన వేగాన్ని ఏ మేరకు తగ్గిస్తాయనేది, వేచి చూడాల్సిందే. 

కాగా స్పీడ్ గన్ లు ప్రస్తుతం ట్రయల్ రన్ కోసం ఏర్పాటు చేసినట్టు అధికారులు పేర్కొంటున్నారు. స్పీడ్ గన్ లను నాలుగైదు రోజులు పరిశీలించిన తర్వాత వేగంగా వెళ్లే వాహనాలపై చర్యలు తీసుకునేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

click me!