సీరియల్స్ లో అవకాశం ఇస్తామని చెప్పి...

Published : Oct 24, 2019, 09:35 AM IST
సీరియల్స్ లో అవకాశం ఇస్తామని చెప్పి...

సారాంశం

సంగారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన నారాయణరాజు(44) ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ... ఎస్ఆర్ నగర్ లో ఓ హాస్టల్ లో పెయింగ్ గెస్టుగా ఉంటున్నాడు. కొద్ది కాలం క్రితం సుమ అనే యువతితో అతనికి పరిచయం ఏర్పడింది. ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని సినిమాలు, సీరియల్స్ డైరెక్టర్లు తనకు తెలుసు అని ఆమెను నమ్మించాడు.

సినిమాల్లో, సీరియల్స్ నటించాలని చాలా మంది యువతులు కలలు కంటూ ఉంటారు. కాగా.... వారి ఆశలను కొందరు అవకాశంగా తీసుకొని... తమ దుర్భుద్ది బయటపెడుతూ ఉంటారు. కొందరు యువతులను శారీరకంగా వినియోగించుకొని మోసం చేస్తుంటే.... మరికొందరు మాత్రం డబ్బు తీసుకొని వాళ్లకు టోపీ పెడుతున్నారు. ఇలాంటి సంఘటనే తాజాగా హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. ఓ యువతికి సీరియల్స్ లో నటించే అవకాశం ఇస్తానని నమ్మించి... ఓ ఉపాధ్యాయుడు రూ.లక్ష తో టోకరా పెట్టాడు. ఈ సంఘటన ఎస్ఆర్ నగర్ లో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

AlsoRead పోలీస్ స్టేషన్ కి వచ్చి... కానిస్టేబుల్ వేలు, తొడ కొరికేశాడు

పూర్తి వివరాల్లోకి వెళితే... సంగారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన నారాయణరాజు(44) ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ... ఎస్ఆర్ నగర్ లో ఓ హాస్టల్ లో పెయింగ్ గెస్టుగా ఉంటున్నాడు. కొద్ది కాలం క్రితం సుమ అనే యువతితో అతనికి పరిచయం ఏర్పడింది. ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని సినిమాలు, సీరియల్స్ డైరెక్టర్లు తనకు తెలుసు అని ఆమెను నమ్మించాడు.

వాళ్లతో మాట్లాడి... సీరియల్స్ లో నటించే అవకాశం ఇప్పిస్తానని నమ్మబలికాడు. కాగా... అతను చెప్పింది నిజమని ఆ యువతి నమ్మింది. నిజంగానే అవకాశం ఇస్తాడనుకొని రూ.లక్ష అతని చేతిలో పెట్టింది. డబ్బు తీసుకున్న తర్వాత అతను కనిపించకుండా పోవడం గమనార్హం. అతను పనిచేస్తున్న పాఠశాలకు వెళ్లి ఆరా తీయగా..... అతను అక్కడ మానేసి వెళ్లిపోయినట్లు తెలుసుకొని యువతి బాధపడింది. కూకట్ పల్లిలో ఉంటున్నాడని తెలసి అక్కడికి వెళ్లినా... అక్కడ కూడా లేకపోవడం తో యువతి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్