Huzurnagar Election Result :హుజూర్‌నగర్‌ ఫలితం.. టీఆర్ఎస్ జోరు

By narsimha lode  |  First Published Oct 24, 2019, 8:53 AM IST

హుజూర్‌నగర్ అసెంబ్లీ  స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డి దూసుకుపోతున్నాడు. వరుస రౌండ్లలో సైదిరెడ్డికి  ఆధిక్యం పెరుగుతోంది.



హుజూర్‌నగర్‌: సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్  అసెంబ్లీ నియోజకవర్గానికి  జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డికి మూడు రౌండ్లలో 6500 ఓట్ల మెజారిటీ లభించింది.

ఈ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతిని బరిలోకి దింపారు.మొదటి రౌండ్‌లో  టీఆర్ఎస్ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పద్మావతి కంటే ముందంజలో ఉన్నారు.

Latest Videos

undefined

మొదటి రౌండ్‌లో టీఆర్ఎస్ రౌండ్‌లో 2580 ఓట్ల ఆధిక్యం లభించింది. రెండో రౌండ్‌లో కూడ టీఆర్ఎస్ అభ్యర్ధికి  మెజారిటీ దక్కింది. దీంతో రెండో రౌండ్ కు 4 వేలకు పైగా  ఓట్ల ఆధిక్యం లభించింది.  ఇక మూడో రౌండ్ లో కూడ కాంగ్రెస్ అభ్యర్ధి కంటే ఆదిక్యత దక్కింది. మూడు రౌండ్లలో కలిపి సైదిరెడ్డికి 6500 ఓట్ల మెజారిటీ వచ్చింది.

మిగిలిన రౌండ్లలో కూడ ఇదే రకమైన పరిస్థితి కన్పించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.హుజూర్ నగర్లో మాత్రం గత దఫా కన్నా పోలింగ్ శాతం అధికంగా నమోదవ్వడం విశేషం. ఈ పెరిగిన శాతం తమకంటే తమకు లాభం కలిగిస్తుందని ఇటు తెరాస, కాంగ్రెస్ లు తెగ వాదులాడుకుంటున్నాయి. ఇటు అధికార తెరాస, సిట్టింగ్ కాంగ్రెస్ ఇరు పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోరు ఉత్కంఠంగా మారింది. ఒక రెఫరెండం మాదిరిగా ఈ ఎన్నికను అందరూ భావించడం వల్ల ప్రజలు భారీ సంఖ్యలో ఓట్లు వేశారు. 

తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న హుజూర్‌నగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం ప్రారంభమైంది. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఓట్ల లెక్కింపును ప్రారంభించారు.  మొత్తం 22 రౌండ్లలో ఓట్లను లెక్కించేందుకు గాను 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతీ పది నిమిషాలకు ఒక్క రౌండ్ ఫలితం వెలువడనుంది..  నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్లు 2 లక్షల 751. మండలానికి 5 పోలింగ్ కేంద్రాల చొప్పున వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు చేపట్టారు.

మనుషులు చనిపోతున్నా స్పందించరా..?: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్...

తమిళిసైయాక్టివ్ : మరో అధికార కేంద్రంగా రాజ్ భవన్...

#HuzurNagar Result: ఐదో రౌండ్‌లో 11 వేల ఓట్ల ఆధిక్యంలో సైదిరెడ్డి...

హుజూర్‌నగర్‌‌లో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం: మహారాష్ట్ర, హర్యానాల్లోనూ రేపే ...

click me!