తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న హుజూర్‌నగర్ ఉపఎన్నికలో విజేత ఎవరో మరికొద్దిగంటల్లో తేలిపోనుంది. గురువారం ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.
హుజూర్‌నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ పద్మావతిపై 43,284 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
గతేడాది డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన సైదిరెడ్డి.. పరాజయంతో ఏమాత్రం క్రుంగిపోకుండా ఉపఎన్నికల్లో సత్తా చాటారు. ప్రచారంతో పాటు ప్రజల మద్ధతును కూడగట్టడంలో ఆయన విజయం సాధించారు.
హుజూర్‌నగర్ ఉపఎన్నికలో 20వ రౌండ్ ఫలితం వెలువడింది. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 40,547 ఓట్ల మెజార్టీతో ఉన్నారు.
టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి తిరుగులేని మెజార్టీతో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే రికార్డు ఆధిక్యాన్ని అధిగమించిన ఆయన.. 19వ రౌండ్ ముగిసేసరికి 38,344 ఓట్ల మెజార్టీలో నిలిచారు.
17వ రౌండ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డికి 34,506 ఓట్ల మెజారిటీ లభించింది. ఆయన గెలుపు దాదాపుగా ఖరారవ్వడంతో గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
16వ రౌండ్ ఫలితం వెలువడింది. టీఆర్ఎస్ అభ్యర్ధి ఎదురులేకుండా దూసుకెళుతూ 32, 256 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి భారీ మెజార్టీతో దూసుకెళ్తున్నారు. 15వ రౌండ్ ముగిసేసరికి ఆయన 29,967 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.
హుజూర్‌నగర్ ఉపఎన్నిక ఫలితంలో 14వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డి 26,999 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు.
హుజూర్‌నగర్‌లో భారీ విజయం దిశగా టీఆర్ఎస్ దూసుకెళ్తోంది. 13వ రౌండ్ ముగిసేసరికి ఆ పార్టీ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డి 25,366 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. మరికాసేపట్లో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మీడియా ముందుకు రానున్నారు.
హుజూర్‌నగర్ ఉపఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించడంపై ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఓటింగ్ నాడు పోలైన అన్నీ వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ సహా మిగిలిన అభ్యర్ధులు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి వినతిపత్రం సమర్పించారు.
హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఫలితంలో టీఆర్ఎస్ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డి విజయం దిశగా దూసుకెళ్తున్నారు. 12వ రౌండ్ ముగిసే సరికి ఆయన 23,821 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.
హుజూర్‌నగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో 11వ రౌండ్ ఫలితం వెలువడింది. ఆ రౌండ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డి 21,618 ఓట్ల మెజార్టీతో ఉన్నారు.
హుజూర్‌నగర్ ఉపఎన్నికలో విపక్షాల ఎత్తులు పనిచేయలేదన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ విజయం దిశగా దూసుకెళ్తుండటంతో ఆయన స్పందించారు. విపక్షాలు ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన హితవు పలికారు.
ఇది కేవలం హుజూర్‌నగర్ ప్రజల తీర్పు కాదని.. రాష్ట్ర ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉన్నారని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గ్రహించారని ఆయన గుర్తు చేశారు.
హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. 9వ రౌండ్ ముగిసేసరికి ఆ పార్టీ శానంపూడి సైదిరెడ్డి 20,100 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు.
తెలంగాణ ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారన్నారు హుజూర్‌నగర్ టీఆర్ఎస్ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డి. తొలి రౌండ్ నుంచి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్న ఆయన 9వ రౌండ్ ముగిసేసరికి 19,200 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.
ఈ సందర్భంగా సైదిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 2014 నుంచి కేసీఆర్‌కు దూరంగా ఉన్నామని భావించిన హుజూర్‌నగర్ ప్రజలు కేసీఆర్‌కు దగ్గర కావాలనే ఉద్దేశ్యంతోనే ఈ విధమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డి 9వ రౌండ్ ముగిసేసరికి 19,200 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ పద్మావతి ఏ రౌండ్‌లోనూ పోటీ ఇచ్చే పరిస్ధితి కనిపించడం లేదు.
హుజూర్‌నగర్‌లో కారు స్పీడుగా దూసుకెళ్తోంది ఏడో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డి 14,300 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
హుజూర్‌నగర్‌లో ప్రతిరౌండ్‌లోనూ టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆ పార్టీ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డి 12,300 ఓట్ల మెజార్టీతో ఉన్నారు.
హుజూర్‌నగర్ ఉపఎన్నికలో కారు దూసుకెళ్తోంది. ఐదో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్ధి శానంపూడి ముగిసేసరికి 11 వేల పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
హుజూర్‌నగర్‌లో కారు దూసుకెళ్తోంది. నాలుగో రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి 9,356 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. మూడో రౌండ్ ముగిసేసరికి ఆ పార్టీ అభ్యర్ధి సైదిరెడ్డి 6 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
హుజూర్‌నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. రెండో రౌండ్ ముగిసేసరికి ఆ పార్టీ అభ్యర్ధి సైదిరెడ్డి 4,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
హుజూర్‌నగర్ ఉపఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి ముందంజలో ఉన్నారు. మొదటి రౌండ్ ముగిసేసరికి ఆయనకు 2,580 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
సూర్యాపేట మార్కెట్ యార్డులో హుజూర్‌నగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోలింగ్ ఏజెంట్లు, అభ్యర్ధుల సమక్షంలో ఎన్నికల సిబ్బంది ఈవీఎంలను తెరిచారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు.
హుజూర్‌నగర్‌లో ప్రజాస్వామ్యం గెలుస్తుందన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఉత్తమ్ పద్మావతి. కాంగ్రెస్ గెలిస్తే..ప్రజాస్వామ్యం గెలిచినట్లేననే ఆమె తెలిపారు. పద్మావతి గెలుపు కోసం ఆమె భర్త, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా శ్రమించారు. టీఆర్ఎస్‌కు పోటీగా ప్రచారం నిర్వహించారు.
తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న హుజూర్‌నగర్ ఉపఎన్నికలో విజేత ఎవరో మరికొద్దిగంటల్లో తేలిపోనుంది. గురువారం ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 22 రౌండ్లలో ఓట్లను లెక్కించేందుకు గాను 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు.
ప్రతీ పది నిమిషాలకు ఒక్క రౌండ్ ఫలితం వెలువడే అవకాశం ఉంది. నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్లు 2 లక్షల 751. మండలానికి 5 పోలింగ్ కేంద్రాల చొప్పున వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు చేపడతారు
Also Read: మనుషులు చనిపోతున్నా స్పందించరా..?: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
పది గంటల కల్లా ట్రెండింగ్స్ తెలుస్తాయని.. 2 గంటల కల్లా ఫలితం వెలువడుతుందని అధికారులు తెలిపారు. నియోజకవర్గంలోని 302 పోలింగ్ కేంద్రాల్లో 84.75 పోలింగ్ శాతం నమోదైంది.గత దఫా కన్నా పోలింగ్ శాతం అధికంగా నమోదవ్వడం విశేషం.
ఈ పెరిగిన శాతం తమకంటే తమకు లాభం కలిగిస్తుందని ఇటు తెరాస, కాంగ్రెస్ లు తెగ వాదులాడుకుంటున్నాయి. ఇటు అధికార తెరాస, సిట్టింగ్ కాంగ్రెస్ ఇరు పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోరు ఉత్కంఠంగా మారింది. ఒక రెఫరెండం మాదిరిగా ఈ ఎన్నికను అందరూ భావించడం వల్ల ప్రజలు భారీ సంఖ్యలో ఓట్లు వేశారు.
అటు మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు కూడా గురువారమే వెల్లడికానున్నాయి. ఇందుకు సంబంధించి ఎలక్షన్ కమీషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభంకానుంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీ ప్యాట్ ల స్లిప్పులను కూడా లెక్కించనున్నారు.
మహారాష్ట్ర లో బీజేపీ శివసేనల 'మహాయుతి' కూటమి కాంగ్రెస్-ఎన్సీపీల 'మహా అగాధి' తో తలపడుతోంది. దాదాపుగా 3,237మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో కేవలం 235మంది మాత్రమే మహిళా అభ్యర్థులు బరిలో ఉన్నారు.
288 స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికలకు 96,661 పోలింగ్ బూతులు ఏర్పాటు చేసారు. పూర్తి ఎన్నికల విధుల్లో 6.5 లక్షల మంది సిబ్బంది నిమగ్నమయ్యారు.
బీజేపీ అగ్రనాయకత్వం అంతా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ నుండి మొదలుకొని అమిత్ షా,రాజ్ నాథ్ సింగ్ తో సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. జాతీయత నే ప్రధాన అజెండాగా బీజేపీ ప్రచారం సాగింది. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తున్నారంటూ ప్రతిపక్షాలను టార్గెట్ చేసారు.
Also Read:Video: తమిళిసైయాక్టివ్ : మరో అధికార కేంద్రంగా రాజ్ భవన్
హర్యానాలోని 90 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ముఖ్యంగా 4 పార్టీలు పోటీ పడుతున్నాయి. అధికార బీజేపీ, కాంగ్రెస్, ఐఎన్ఎల్డి, జేజేపీ బరిలో ఉన్నాయి. ఆప్,బిఎస్పీలు కూడ బరిలో ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీలు మినహా ఇతర ఏ పార్టీ కూడా అన్ని సీట్లలో పోటీ చేయడం లేదు. హర్యానాలో బరిలో నిలిచిన అభ్యర్థుల్లో చాల మంది ధనవంతులు ఉన్నారు.
రాష్ట్రంలో పార్టీ నేతృత్వం మారిన తరువాత హర్యానాలో కాంగ్రెస్ ఎలాగైనా తన పూర్వ వైభవాన్ని సాధించి తీరుతామని నమ్మకంగా ఉన్నారు. మరోవైపేమో మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలో మరోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టి తీరుతామని కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
ఉన్న 90 సీట్లలో ఎలాగైనా 75 సీట్లు గెలవాల్సిందే అని టార్గెట్ ఫిక్స్ చేసారు. ప్రస్తుతం ఉన్న 90 సీట్లలో బీజేపీకి 48 సీట్లున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో ఉన్న 10 స్థానాలకు 10 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది.