హైద్రాబాద్ ఫుడ్‌కోర్టు వాష్‌రూమ్‌లో కెమెరా ఘటనలో ట్విస్ట్: రూ. 15 లక్షలకు మధ్యవర్తిత్వం వహించిన కేశవ్

By narsimha lodeFirst Published Sep 23, 2021, 12:35 PM IST
Highlights


హైద్రాబాద్ నగరంలోని వన్ డ్రైవిన్ ఫుడ్ కోర్టులోని మహిళల వాష్ రూమ్ లో మహిళల వీడియోలకు సంబంధించి రూ. 15 లక్షలు ఇవ్వాలని కేశవ్ అనే వ్యక్తి మధ్యవర్తిత్వం వహించినట్టుగా  ఫుడ్ కోర్టు యజమాని చైతన్య పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు.
 

హైదరాబాద్: హైద్రాబాద్(Hyderabad) నగరంలోని వన్ డ్రైవిన్ ((One drive in)) ఓ ఫుడ్ కోర్టు (food court) లోని మహిళల వాష్ రూమ్‌లో(women wash room) వీడియోలను రికార్డు (video shoot)చేసిన ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకొంది.సెల్‌ఫోన్ లో రికార్డైన మహిళల వీడియోలను డిలీట్ చేయడంతో పాటు పోలీస్ కేసు లేకుండా చూస్తామని కేశవ్ (keshav) అనే వ్యక్తి  సంప్రదించినట్టుగా ఫుడ్ కోర్టు యజమాని చైతన్య(chaitanya) చెబుతున్నారు. ఈ ఫుడ్ కోర్టులో పనిచేస్తున్న మైనర్ బాలుడు బెనర్జీ వాష్ రూమ్ లో సెల్‌ఫోన్ ద్వారా వీడియోలను రికార్డు చేశాడు.

also read:ఫుడ్ కోర్ట్ బాత్రూంలో కెమెరా.. చూసి షాకైన యువతి..మూడురోజులగా 20 మంది వీడియోలు...

అయితే ఈ వాష్ రూమ్ ను ఉపయోగించిన కొందరు మహిళలకు కూడా  కేశవ్ ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన విషయం తన దృష్టికి వచ్చిందని చైతన్య మీడియాకు చెప్పారు.తనను కూడా  కేశవ్ అనే వ్యక్తి బ్లాక్ మెయిల్ చేశాడని చైతన్య తెలిపారు. రూ. 15 లక్షలిస్తే వీడియోలు డిలీట్ చేయడంతో పాటు కేసులు లేకుండా చేస్తానని చెప్పాడని చైతన్య మీడియాకు చెబుతున్నారు. అసలు ఈ కేశవ్ ఎవరనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

బుధవారం నాడు ఒక్క రోజే ఈ సెల్ ఫోన్ నుండి 4 గంటల వీడియోలు రికార్డైనట్టుగా పోలీసులు గుర్తించారు. బెనర్జీ వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఫుడ్ కోర్టు యజమాని చెబుతున్న కేశవ్ అనే వ్యక్తి గురించి కూడ పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది.

ఫుడ్ కోర్టులోని సీసీ కెమెరాలు కొన్ని పనిచేయడం లేకపోవడం కూడ అనుమానాలకు తావిస్తోంది.

click me!