ఢిల్లీకి మరోసారి కేసీఆర్: ఈ నెల 24న హస్తిన టూర్

Published : Sep 23, 2021, 11:57 AM ISTUpdated : Sep 24, 2021, 03:55 PM IST
ఢిల్లీకి మరోసారి కేసీఆర్: ఈ నెల 24న హస్తిన టూర్

సారాంశం

ఈ నెల 24వ తేదీన తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశంలో పాల్గొనేందుకు సీఎం ఢిల్లీ వెళ్లనున్నారు.ఈ నెల మొదటి వారంలోనే కేసీఆర్ ఢిల్లీలో పర్యటించారు.

ఈ నెల 24వ తేదీన తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR delhi visit)ఢిల్లీకి (Delhi)వెళ్లనున్నారు. మావోయిస్టు (maoist) ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశంలో కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉంది.ఈ నెల 24వ తేదీనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly sessions)ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24వ తేదీ ఉదయం 11 గంటలకు  తెలంగాణ అసెంబ్లీ ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి.  

అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశం తెలంగాణ భవన్ లో జరిగే అవకాశం ఉంది.ఈ సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు సంస్థాగత ఎన్నికలపై చర్చించే అవకాశం ఉంది.
టీఆర్‌ఎస్ శాసనసభపక్ష సమావేశం ముగిసిన తర్వాత కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. 

ఇటీవలనే సీఎం కేసీఆర్ వారం రోజుల పాటు ఢిల్లీలో గడిపారు. ప్రధాని మోడీ, అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలుసుకొన్నారు. మరోసారి ఆయన ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకొంది. ఢిల్లీలో మూడు రోజులు సీఎం కేసీఆర్ ఉంటారని సమాచారం.

PREV
click me!

Recommended Stories

Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!