ఎంగిలి మెతుకులు తినే ఓ బాల్క సుమన్... దమ్ముంటే ఓయూకు రా: బోడిగె శోభ సవాల్ (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Sep 23, 2021, 11:10 AM ISTUpdated : Sep 23, 2021, 11:14 AM IST
ఎంగిలి మెతుకులు తినే ఓ బాల్క సుమన్... దమ్ముంటే ఓయూకు రా: బోడిగె శోభ సవాల్ (వీడియో)

సారాంశం

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రపై విమర్శలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు బోడిగె శోభ స్ట్రాంట్ కౌంటర్ ఇచ్చారు. 

కరీంనగర్: తెలంగాణలో ఎంతమంది నిరుద్యోగులకు (Telangana Unemployment) ఉద్యోగాలు ఇప్పించావో చెప్పు... దమ్ముంటే మీ ప్రభుత్వం నుండి ఉద్యోగాల భర్తీపై శ్వేతపత్రం తీసుకుని ఉస్మానియా యూనివర్సిటీకి రా అంటూ టీఆర్ఎస్ (TRS) ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) కు మాజీ ఎమ్మెల్యే, బిజెపి నాయకురాలు బోడిగె శోభ (Bodige shobha) సవాల్ విసిరారు. ఎంగిలి మెతుకులు తినే నువ్వా రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ (Bandi Sanjay) గురించి మాట్లాడేది అంటూ శోభ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో బొడిగే శోభ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... బండి సంజయ్ పై విమర్శలు చేసిన బాల్క సుమన్ కు గట్టిగా కౌంటరిచ్చారు. దళిత బంధు విషయంలో ప్రభుత్వ  తీరు గురించి ప్రజల్లో జరుగుతున్న చర్చను డైవర్ట్ చేయడానికే సంజయ్ గురించి సుమన్ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

''ముందు నీ నియోజకవర్గంలో దళితులకు దళిత బంధు కింద రూ.10 లక్షలు ఇప్పించు.  దళిత రక్తమే నీలో ఉంటే 119 నియోజకవర్గాలలో దళిత బంధు ఇప్పివ్వు లేంటే రాజీనామ చేయి. నీవు దళితబిడ్డవే అయితే దళిత సీఎం, 3 ఎకరాల భూమి వంటి సీఎం కేసీఆర్ హామీలపై ప్రెస్ మీట్ పెట్టు'' అంటూ మండిపడ్డారు. 

వీడియో

''బండి సంజయ్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర చేస్తున్నారు. నువ్వు అన్న విహారయాత్రల రాజకీయాలు చేసేది కేటీఆర్ , కవిత, సంతోష్ రావులు... బండి సంజయ్ కాదు. సంచులు మోసే నీకు తెలియదా ఆ విషయం'' అంటూ మండిపడ్డారు. 

''మా అధ్యక్షులు సంజయ్ పిలుపిస్తే నీ నియోజకవర్గం కూడా దాటలేవు. అలాంటి పరిస్థితి రాకుండా వుండాలంటే వెంటనే బీజేపీకి, బండి సంజాయ్, ఈటల రాజేందర్ కి క్షమాపణ చెప్పు'' అంటూ సుమన్ ను శోభ హెచ్చరించారు. 

read more  ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు పెంచితే ఊరుకునేది లేదు: కేసీఆర్‌కు బండి సంజయ్ ఆల్టీమేటం

''ఓయూ బిడ్డల గురించి పట్టదా... నీ కొరకు ఇంట్లో రెండు పదవులు వస్తే సరిపోద్దా. రెండు లక్షలకి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇప్పించే బాధ్యత లో ఉండు. నీకు చిత్తశుద్ధి ఉంటే నిరుద్యోగ సమస్యపై అసెంబ్లీలో మాట్లాడు'' అని ఎమ్మెల్యేకు సూచించారు. 

''కేసీఆర్ కుటుంబం ఏజెంటువైన నువ్వు దళిత ద్రోహివి. ఇకపై బిజెపి గురించి గానీ, మా నాయకుల గురించి గానీ  హుజురాబాద్ కు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పొలిమేర కూడా దాటనివ్వం'' అంటూ శోభ ఎమ్మెల్యే సుమన్ ను హెచ్చరించారు.

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu