హైదరాబాద్‌లోని ప్రైడ్ ఇండియా క్రిస్టల్ టౌన్‌షిప్‌లో భవనాల కూల్చివేత..

Published : Apr 01, 2023, 03:01 PM IST
హైదరాబాద్‌లోని ప్రైడ్ ఇండియా క్రిస్టల్ టౌన్‌షిప్‌లో భవనాల కూల్చివేత..

సారాంశం

హైదరాబాద్‌ని ప్రైడ్ ఇండియా క్రిస్టల్ టౌన్‌షిప్‌లోని భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో అధికారులు ఈ ప్రక్రియ చేపట్టారు.   

హైదరాబాద్‌: నగరంలోని ప్రైడ్ ఇండియా క్రిస్టల్ టౌన్‌షిప్‌లోని భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో ప్రైడ్ ఇండియాకు చెందిన కూల్చివేత ప్రక్రియ కొనసాగిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు చేశారంటూ ఈ భవనాల కూల్చివేతకు కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో అధికారులు భవనాల కూల్చివేత ప్రక్రియను చేపట్టారు. అధికారులు కూల్చివేత ప్రక్రియ చేపట్టడంతో భవన యజమానులు ఆందోళన చెందుతున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేత ప్రక్రియ  జరుగుతుంది. 

ఇక, ప్రైడ్ ఇండియా క్రిస్టల్ టౌన్‌షిప్‌లో 44 ఎకరాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఈ నిర్మాణాలు పూర్తి కావొస్తున్నాయి. అయితే ఈ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తాజాగా ఈ నిర్మాణాలను కూల్చివేయాలంటూ హైకోర్టు ఆదేశించడంతో.. అధికారులు చర్యలు చేపట్టారు. ఈ రోజు నాలుగు భవనాలను కూల్చివేస్తున్నారు. మిగిలిన వాటిని కూల్చివేస్తామని  చెబుతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. చర్లపల్లి నుంచి ఎక్కడి వరకంటే.?
TSRTC: ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. మార్చి 1 నుంచి త‌గ్గ‌నున్న బ‌స్సు ఛార్జీలు. డీపోల‌కు స‌ర్క్యూల‌ర్ జారీ