డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోయాడు.. పోలీసులు వదిలేలా లేరని బైక్‌కు నిప్పుపెట్టాడు..

By Sumanth KanukulaFirst Published Jan 4, 2022, 9:52 AM IST
Highlights

మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో (drunk and drive)  పట్టుబడితే భారీగా ఫైన్ విధించడమే కాకుండా.. కేసులు నమోదు చేస్తున్నారు. అంతేకాకుండా కోర్టు‌లో హాజరుపరచడం.. కౌన్సిలింగ్ ఇప్పించడం లాంటి చేస్తున్నారు.
 

మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో (drunk and drive)  పట్టుబడితే భారీగా ఫైన్ విధించడమే కాకుండా.. కేసులు నమోదు చేస్తున్నారు. అంతేకాకుండా కోర్టు‌లో హాజరుపరచడం.. కౌన్సిలింగ్ ఇప్పించడం లాంటి చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలతో రోడ్ల మీదకు రావడం వల్ల ప్రమాదాలు జరుగుతున్న ఘటనలు అనేకం చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇలాంటి వారి వల్ల రోడ్డుపై ప్రయాణించే ఇతరులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. 

అయితే కొందరు మందు బాబులు మాత్రం తీరు మాత్రం మారడం లేదు. ఫుల్‌గా మద్యం తాగేసి రోడ్లు ఎక్కుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన సమయంలో కొందరు పోలీసులతో దురుసుగా ప్రవర్తిస్తున్న సందర్భాలను చూస్తునే ఉన్నాం. తాజాగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ఓ వ్యక్తి తన బైక్‌కు నిప్పంటించాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. 

Also read: మందుబాబుల వీరంగం.. కేకలు, అరుపులు, అనుచితపదజాలంతో యువతి హల్ చల్..

నాంపల్లి ట్రాఫిక్‌ పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి రైల్వేస్టేషన్‌ రోడ్‌లో డ్రంకెన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. సజ్జత్‌ ఆలీ ఖాన్‌(30) అనే వ్యక్తి తన బైక్‌పై అటుగా వచ్చాడు. అతనికి పోలీసులు పరీక్షలు నిర్వహించగా.. మద్యం తాగినట్టుగా నిర్దారణ అయింది. దీంతో ఆలీ పోలీసులకు ఏదో విధంగా నచ్చే చెప్పే ప్రయత్నం చేశాడు. అది ఫలించకపోవడంతో అతడు.. తన బైక్‌కు నిప్పంటించాడు. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం అతడిపై ట్రాఫిక్ పోలీసులు నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో అతనిపై నాంపల్లి లా అండ్ ఆర్డర్ పోలీసులు సెక్షన్ 70B కింద న్యూసెన్స్ కేసు నమోదు చేశారు.

click me!