హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. నవ వధువుపై నకిలీ బాబా అత్యాచారం.. గదిలో బంధించి దారుణం..

Published : Aug 30, 2023, 10:00 AM IST
హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. నవ వధువుపై నకిలీ బాబా అత్యాచారం.. గదిలో బంధించి దారుణం..

సారాంశం

హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. ఓ నవ వధువుపై నకిలీ బాబా అత్యాచారానికి పాల్పడ్డాడు. అనారోగ్యానికి చికిత్స నెపంతో ఆమె కళ్లకు గంతలు  కట్టి ఈ దారుణానికి పాల్పడ్డాడు. 

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. ఓ నవ వధువుపై నకిలీ బాబా అత్యాచారానికి పాల్పడ్డాడు. అనారోగ్యానికి చికిత్స నెపంతో ఆమె కళ్లకు గంతలు  కట్టి ఈ దారుణానికి పాల్పడ్డాడు. అయితే చివరకు ఆమె తన తల్లిదండ్రుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. హుస్సేనీఆలం ప్రాంతానికి చెందిన యువతికి మూడు నెలల క్రితం వివాహం జరిగింది. అయితే ఆమె ఆరోగ్యం సరిగా లేకపోవడంతో బండ్లగూడ ప్రాంతంలో ఉంటున్న బజార్ బాబా (నకిలీ బాబా) వద్దకు అత్త మామలు తీసుకెళ్లారు. 

అయితే అక్కడ చికిత్స పేరుతో తన కళ్లకు గంతలు కట్టిన నకిలీ బాబా..  గదిలో బంధించి అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది. అయితే ఈ విషయం బాధితురాలు తన అత్తమామలకు  చెప్పిన స్పందించలేదు. అంతేకాకుండా దెయ్యం పట్టిందని ఇంట్లో బంధించారు. అయితే చివరకు బాధితురాలు తన తల్లిదండ్రుల సహాయంతో భవాని నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన బండ్లగూడ పోలీసు స్టేషన్ పరిధిలో జరగడంతో భవాని నగర్ పోలీసులు కేసును అక్కడికి రిఫర్ చేశారు. 

ఇదిలా ఉంటే, ఈ విషయం బయటకు తెలియడంతో నకిలీ బాబా పరారయ్యాడు. ఇక, పోలీసులు కూడా తనకు న్యాయం చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?