Hyderabad Name: హైదరాబాద్ అసలు పేరు భాగ్యనగరమా? RTIప్రశ్నకు ASI సమాధానమేంటీ? 

By Rajesh KFirst Published Aug 5, 2022, 3:11 PM IST
Highlights

ASI Reply On Hyderabad Name:  హైదరాబాద్ పేరు మార్పుకు సంబంధించిన చారిత్రక ఆధారాలు, రికార్డు వివరాలు త‌మ వ‌ద్ద లేదని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) వెల్ల‌డించింది. 

ASI Reply On Hyderabad Name: ఇటీవ‌ల భారతదేశంలో అనేక‌ చారిత్రక, పురాత‌న‌ నగరాల పేర్లను మార్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్ప‌టికే ప‌లు నగరాల పేర్లను మార్చేశాయ‌ని, ఇత‌ర న‌గ‌రాల‌ పేర్లను మార్చాలనే డిమాండ్ తెర మీద‌కి వ‌చ్చింది. అలాంటి జాబితాలో దక్షిణ భారతదేశంలోని హైదరాబాద్ పేరు కూడా ఉంది. 

ఇటీవల హైదరాబాద్‌ను భాగ్యనగర్‌గా పిలువాల‌ని బీజేపీ పిలువ‌నివ్వ‌డంతో.. హైదరాబాద్‌ను పేరు మార్చాల‌నే చ‌ర్య జోరుగా సాగుతోంది. ఇటువంటి పరిస్థితిలో.. హైదరాబాద్ న‌గ‌రం పేరు మార్పుకు సంబంధించి ఎటువంటి సమాచారం లేదని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) వెల్ల‌డించింది. అలాగే.. హైదరాబాద్ లోని చార్మినార్ సమీపంలో గ‌ల‌ భాగ్యలక్ష్మి ఆలయానికి సంబంధించిన చారిత్రక రికార్డుల వివరాలు కూడా తమ వద్ద లేవని RTIకి సమాధామిచ్చింది ఆర్కియోలాజికల్ డిపార్ట్ మెంట్. 

హైదరాబాద్ కు గ‌తంలో భాగ్యనగరమ‌ని పేరు ఉండేదా? భాగ్యలక్ష్మి ఆలయానికి .. హైదరాబాద్ కు పేరుగ‌ల సంబంధ‌మేమిట‌ని, ఇందుకు గ‌ల సంబంధించిన రికార్డులు లేదా చారిత్రక ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అని RTI కార్యకర్త రాబిన్ జాచియస్ ఆర్కియోలాజికల్ డిపార్ట్ మెంట్ ను ప్ర‌శ్నించారు. అలాగే.. హైదరాబాద్ న‌గ‌రం పేరు మార్పుకు సంబంధించిన ఏదైనా సమాచారముందా? అని పిటిష‌న్ దాఖలు చేశారు. హైదరాబాద్ న‌గ‌రం పేరును మార్చితే.. ఈ మేరకు ASI వ‌ద్ద ఎలాంటి సమాచారముంద‌ని ప్ర‌శ్నించారు. 

ASI రికార్డుల ప్రకారం..  ఒక‌వేళ ఏదైనా మార్పు చేసి ఉంటే.. ఏ సంవత్సరంలో హైదరాబాద్ పేరును భాగ్యనగరం లేదా భాగనగర్ అని మార్చారు? భాగమతి లేదా భాగ్యనగర్ పేరును ప్రస్తావించే శాసనాలు, నాణేలు లేదా ఇతర ఆధారాలు వంటి చారిత్రక ఆధారాలను తెల‌ప‌గ‌ల‌రని ASIని కోరారు. అదే స‌మ‌యంలో.. మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ పేరును మార్చాలని చేసిన ప్రతిపాదనల‌కు సంబంధించిన రికార్టులు ఏమైనా ఉన్నాయా? అని కూడా ప్రశ్నించారు. 

చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి ఆలయాన్ని నిర్మించిన సంవత్సరం కూడా చెప్పాలని రాబిన్ కోరారు.చార్మినార్ ఉన్న చోట భాగ్యలక్ష్మి దేవాలయం ఉన్నట్లు ఏఎస్ఐ హైదరాబాద్ వద్ద రికార్డు లేదా ఆధారాలు ఉన్నాయా? అని ప్ర‌శ్నించారు.  

ఈ ప్రశ్నలకు సమాధానంగా.. ఆర్కియాల‌జీ డిపార్ట్ మెంట్ స‌ర్వే ఆఫ్ ఇండియా (ASI) త‌మ‌ హైదరాబాద్  కార్యాలయంలో అలాంటి వివరాలు అందుబాటులో లేవని తెలిపింది. ఏఎస్ఐ హైదరాబాద్ సర్కిల్ పరిధిలో దాదాపు ఎనిమిది స్మారక చిహ్నాలు ఉన్నాయనీ, ఇందులో హైదరాబాద్‌లోని చార్మినార్,  గోల్కొండ కోట.. ఇత‌ర చారిత్ర‌క క‌ట్ట‌డాలు ఉన్న‌ట్టు పేర్కొంది. 

click me!