భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం నాడు కేంద్ర హోంశాఖ మంత్రి భేటీ కానున్నారు. తెలంగాణలో వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని కోమటిరెడ్డి వెంట్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరనున్నారు.
శుక్రవారం నాడు భేటీ కానున్నారు. Telangana రాష్ట్రంలో ఇటీవల కాలంలో వచ్చిన Rains, Floodతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా సుమారు రూ. 1400 కోట్లకు పైగా నష్టపోయిన విషయాన్ని కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అమిత్ షాకు వివరించనున్నారు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ ఉదయమే ఢిల్లీకి చేరుకున్నారు. బీజేపీ అగ్రనేతలతో భేటీ కానున్నారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారు.ఈ సభకు రావాలని అమిత్ షా ను ఆహ్వానిస్తున్నారు.ఈ సభలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఈ విసయమై చర్చించేందుకు రాజగోొపాల్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు.
undefined
అమిత్ షా అపాయింట్ మెంట్ ను కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడిగారు. మరో వైపు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కేంద్ర మంత్రి అమిత్ షా తో భేటీ కోసం అపాయింట్ మెంట్ అడిగారు. పార్లమెంట్ లోని తన చాంబర్ లో మధ్యాహ్నం రెండున్నర గంటలకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అమిత్ షా అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఈ సమయంలో రాష్ట్రంలో వరదలతో పాటు లోన్ యాప్స్, ఇతర సమస్యలపై అమిత్ షాతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చర్చించనున్నారు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 2వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. నిన్న కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీకి లేఖను పంపారు. ఈ నెల 8వ తేదీన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి తన రాజీమానా లేఖను అందించనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనను అంతమొందించి అధికారంలోకి రావాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల్లోని కీలక నేతలను తమ పార్టీలోకి బీజేపీ ఆహ్వానిస్తుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్ లో ఉన్నారని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ప్రకటించారు. మునుగోడుతో పాటు పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందని బండి సంజయ్ ప్రకటించారు.
also read:ఇక రేవంత్ ముఖం చూడను: చెరుకు సుధాకర్ కాంగ్రెస్ లో చేరికపై మండిపడ్డ కోమటిరెడ్డి
తెలంగాణలో వివిధ పార్టీల నుండి బీజేపీలో చేరే నేతల జాబితాను బీజేపీ చేరికల కమిటీ చైర్మెన్ ఈటల రాజేందర్ గత వారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అందించారు. ఆయా నేతల బల బలాలను జేపీ నడ్డాకు వివరించారు.