ఇలాంటి కరోనాలు ఏమీ చేయలేవు: హోంక్వారంటైన్ నుండి బొంతు రామ్మోహన్ (వీడియో)

By Arun Kumar PFirst Published Jul 27, 2020, 12:34 PM IST
Highlights

తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు... హోంక్వారంటైన్ లో వున్నట్లు బొంతు రామ్మోహన్ స్వయంగా వెల్లడించారు. 

హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ కు కరోనా సోకింది. గతంలో రెండు దఫాలు ఆయన పరీక్షలు నిర్వహించుకొన్నా నెగిటివ్ రాగా తాజాగా నిర్వహించిన రాపిడ్ టెస్ట్ లో పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. అయితే కరోనా లక్షణాలు లేకుండా ఆరోగ్యంగా వుండటంతో ఆయన హోంక్వారంటైన్ లోనే వుంటున్నారు.

అయితే తాజాగా తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు... హోంక్వారంటైన్ లో వున్నట్లు బొంతు రామ్మోహన్ స్వయంగా వెల్లడించారు. '' నాకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయినా చాలా యాక్టివ్ గా వున్నాను. ఎలాంటి ఇబ్బంది లేదు. కరోనాను భయంతో కాకుండా మనోధైర్యంతో ఎదుర్కొందాం. పాజిటివ్ గా నిర్దారణ అయినా భయాందోళనకు గురికావొద్దు. కరోనా నుండి త్వరగా కోలుకోవాలంటూ నా మంచిని కోరుకుంటున్న అందరికీ ధన్యవాదాలు'' అంటూ ట్వీట్ చేసి దానికి తన వీడియో సందేశాన్ని జతచేశారు బొంతు రామ్మోహన్. 

read more   హైద్రాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా: కుటుంబసభ్యులకు నెగిటివ్
 
''నాకు కరోనా వచ్చిందని ఎవరూ ఆందోళన చెందొద్దు. నాకు కరోనా పాజిటివ్ గా తేలినా ఎలాంటి లక్షణాలు లేవు, చాలా ఆరోగ్యంగా ఉన్నాను. అన్ని జాగ్రత్తలు తీసకుంటూ, కరోనా నిబంధనలను పాటిస్తూ, ఎవరినీ దగ్గరకు రానీయకుండా ప్రత్యేక గదిలో వుంటున్నారు. అవసరమైన మందులు మాత్రమే తీసుకుంటున్నాను. అయితే కరోనాను చూసి ఎవరూ భయపడిపోవద్దన్నారు. మనోధైర్యంతో ముందుకు వెళితే మనల్ని ఇలాంటి కరోనాలు మనల్ని ఏమీ చేయలేవు. మనోధైర్యాన్ని మించింది ఏమీ లేదు. 

ఈ కరోనా సమయంలో కూడా మంత్రి  కేటీఆర్ ఆదేశాలతో నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు ఫోన్, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షలు నిర్వహిస్తా. అదరక బెదరక గుండె నిబ్బరంతో ముందుకు వెళ్తే  విజయవంతంగా జయించగలుగుతాం. నా మంచికోరే మిత్రులు, శ్రేయోభిలాషులు, నగర  ప్రజలందరికీ ధన్యవాదాలతో... మీ బొంతు రామ్మోహన్‌''  అంటూ వీడియో సందేశాన్ని బొంతు రామ్మోహన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.  

వీడియో

Am tested positive. Am up and active. No difficulty at all. Let’s face COVID with courage and not with fear. Do not get panic if you are tested positive. Thanks for your wishes for my well-being and fast recovery. 🙏 pic.twitter.com/4uiQov3g3g

— Dr BonthuRammohan,Mayor (@bonthurammohan)

 

click me!