కరోనా కేసుల వివరాల విషయంలో తెలంగాణ హైకోర్టు మరోసారి కెసీఆర్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కేసుల విషయంలో తమ ఉత్తర్వులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడింది.
హైదరాబాద్: కరోనా వైరస్ కేసుల వివరాల విషయంలో రాష్ట్ర హైకోర్టు మరోసారి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి మండిపడింది. జూన్ 8వ తేదీ నుంచి తమ ఉత్తర్వులు అమలు కావడం లేదని సోమవారం తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
తమ ఉత్తర్వుల అమలుపై ఏం చేయమంటారో రేపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినే అడుగుతామని చెప్పింది. తమ ఉత్తర్వుల అమలు కష్టమైతే ఎందుకో చెప్పాలని అడిగింది. కరోనా కేసుల విషయంలో తమ ఉత్తర్వులు అమలు కావడం లేదని వ్యాఖ్యానించింది.
undefined
ఆదివారం విడుదల చేసిన బులిటెన్ లో కూడా కరోనా కేసుల వివరాలు సరిగా లేవని హైకోర్టు ఆసంతృప్తి వ్యక్తం చేసింది. తమ ఉత్తర్వులను కూడా ప్రభుత్వం అమలు చేయకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. కరోనా కేసుల విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
ఇదిలావుంటే, తెలంగాణలోని జిహెచ్ఎంసీ పరిధిలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. అత్యధిక కేసులు హైదరాబాదు మహానగర నగరపాలక సంస్థ పరిధిలోనే రికార్డవుతున్నాయి. సోమవారం విడుదల చేసిన వివరాలు ప్రకారం..... గత 24 గంటల్లో తెలంగాణలో 1473 కేసులు నమోదయ్యాయి. వీటిలో జిహెచ్ఎంసీ పరిధిలోనే 506 కేసులు నమోదయ్యాయి.
తాజాగా గత 24 గంటల్లో కోరనా వైరస్ తో 8 మంది మరణించారు. దీంతో తెలంగాణలో కోవిడ్ -19తో మృత్యువాత పడినవారి సంఖ్య 471కి చేరుకుంది. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 55,532కు చేరుకుంది.
తాజాగా గత 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లాలో 28, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10, జగిత్యాల జిల్లాలో 18, జనగామ జిల్లాలో 10, జయశంకర్ జిల్లాలో 10, జోగులాం గద్వాల జిల్లాలో 32, కామారెడ్డి జిల్లాలో 17, కరీంనగర్ జిల్లాలో 91 కేసులు నమోదయ్యాయి.
హైదరాబాదుకు సమీపంలో ఉండే మెడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 86 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 168 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో 20, మహబూబ్ నగర్ జిల్లాలో 8, మహబూబాబాద్ జిల్లాలో 34 కేసులు నమోదయ్యాయి. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో కేసులు ఏవీ నమోదు కాలేదు.
మంచిర్యాల జిల్లాలో 14, మెదక్ జిల్లాలో 17, ములుగు జిల్లాలో 12, నాగర్ కర్నూలు జిల్లాలో 19, నల్లగొండ జిల్లాలో 28, నారాయణపటే జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలో కొత్తగా కేసులేమీ నమోదు కాలేదు. నిజామాబాద్ జిల్లాలో 41 కేసులు నమోదయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో కూడా కేసులేమీ నమోదు కాలేదు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 19, సంగారెడ్డి జిల్లాలో 98, సిద్ధిపేట జిల్లాలో 12, వికారాబాద్ జిల్లాలో 2, సూర్యాపేట జిల్లాలో 32, వనపర్తి జిల్లాలో 9, వరంగల్ రూరల్ జిల్లాలో 8, వరంగల్ అర్బన్ జిల్లాలో 111 కరోనా కేసులు నమోదయ్యాయి.