హైదరాబాద్ లో కరోనా విజృంభణ: తెలంగాణలో 55 వేలు దాటిన పాజిటివల్ కేసులు

Published : Jul 27, 2020, 12:11 PM IST
హైదరాబాద్ లో కరోనా విజృంభణ: తెలంగాణలో 55 వేలు దాటిన పాజిటివల్ కేసులు

సారాంశం

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. గత 24 గంటల్లో జిహెచ్ఎంసి పరిధిలో 506 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 8 మంది కోవిడ్ తో 8 మంది మృత్యువాత పడ్డారు.

హైదరాబాద్: తెలంగాణలోని జిహెచ్ఎంసీ పరిధిలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. అత్యధిక కేసులు హైదరాబాదు మహానగర నగరపాలక సంస్థ పరిధిలోనే రికార్డవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో తెలంగాణలో 1473 కేసులు నమోదయ్యాయి. వీటిలో జిహెచ్ఎంసీ పరిధిలోనే 506 కేసులు నమోదయ్యాయి.

తాజాగా గత 24 గంటల్లో కోరనా వైరస్ తో 8 మంది మరణించారు. దీంతో తెలంగాణలో కోవిడ్ -19తో మృత్యువాత పడినవారి సంఖ్య 471కి చేరుకుంది. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 55,532కు చేరుకుంది. 

తాజాగా గత 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లాలో 28, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10, జగిత్యాల జిల్లాలో 18, జనగామ జిల్లాలో 10, జయశంకర్ జిల్లాలో 10, జోగులాం గద్వాల జిల్లాలో 32, కామారెడ్డి జిల్లాలో 17, కరీంనగర్ జిల్లాలో 91 కేసులు నమోదయ్యాయి. 

హైదరాబాదుకు సమీపంలో ఉండే మెడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 86 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 168 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో 20, మహబూబ్ నగర్ జిల్లాలో 8, మహబూబాబాద్ జిల్లాలో 34 కేసులు నమోదయ్యాయి. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో కేసులు ఏవీ నమోదు కాలేదు.

మంచిర్యాల జిల్లాలో 14, మెదక్ జిల్లాలో 17, ములుగు జిల్లాలో 12, నాగర్ కర్నూలు జిల్లాలో 19, నల్లగొండ జిల్లాలో 28, నారాయణపటే జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలో కొత్తగా కేసులేమీ నమోదు కాలేదు. నిజామాబాద్ జిల్లాలో 41 కేసులు నమోదయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో కూడా కేసులేమీ నమోదు కాలేదు. 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 19, సంగారెడ్డి జిల్లాలో 98, సిద్ధిపేట జిల్లాలో 12, వికారాబాద్ జిల్లాలో 2, సూర్యాపేట జిల్లాలో 32, వనపర్తి జిల్లాలో 9, వరంగల్ రూరల్ జిల్లాలో 8, వరంగల్ అర్బన్ జిల్లాలో 111 కరోనా కేసులు నమోదయ్యాయి.

 

 

PREV
click me!

Recommended Stories

Real Estate : లక్షల్లో పెట్టుబడి, కోట్లలో లాభం ! హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నెక్స్ట్ డెస్టినేషన్ ఇదే
YCP Leaders Protest Against ABN Weekend Comment Over Controversial Remarks | Asianet News Telugu