మరో అమ్మాయితో పెళ్లి.. ఇంటికొచ్చి తాళి కట్టించిన ప్రియురాలి బంధువులు, మొదటి భార్యతో యువకుడు పరార్

Siva Kodati |  
Published : Jun 02, 2022, 08:30 PM IST
మరో అమ్మాయితో పెళ్లి.. ఇంటికొచ్చి తాళి కట్టించిన ప్రియురాలి బంధువులు, మొదటి భార్యతో యువకుడు పరార్

సారాంశం

హైదరాబాద్‌లో విచిత్ర సంఘటన జరిగింది. పెళ్లయిన యువకుడికి మరుసటి రోజే మరో పెళ్లి జరిపించారు. హైదరాబాద్‌ ఉప్పల్‌లో ఈ ఘటన జరిగింది. చివరికి విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది.   

పెళ్లయిన యువకుడికి మరుసటి రోజే మరో పెళ్లి చేశారు. ఈ సంఘటన హైదరాబాద్ ఉప్పల్‌లో జరిగింది. శ్రీకాంత్ అనే యువకుడు కొన్నాళ్ల క్రితం ఓ యువకుడిని ప్రేమించాడు. అయితే ఆమెను కాదని మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలి బంధువులు శ్రీకాంత్ కుటుంబంపై దాడి చేశారు. అంతేకాదు.. శ్రీకాంత్‌తో బలవంతంగా ప్రియురాలి మెడలో తాళి కట్టించారు. తమ కుమారుడికి బలవంతంగా రెండో పెళ్లి చేయించారంటూ అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇంతలోనే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. రెండో పెళ్లి ఇష్టం లేని యువకుడు మొదటి భార్యతో వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : మరో అల్పపీడనం రెడీ .. ఈ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు
Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం