హైదరాబాద్‌లో దారుణం.. గుట్కాలు తింటోందని గొంతుపై కాలితో తొక్కి భార్యను చంపేశాడు..

Published : Sep 25, 2021, 02:24 PM ISTUpdated : Sep 25, 2021, 02:25 PM IST
హైదరాబాద్‌లో దారుణం..  గుట్కాలు తింటోందని గొంతుపై కాలితో తొక్కి భార్యను చంపేశాడు..

సారాంశం

హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం తాగుతున్నదని, గుట్కాలు తింటోందని ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను కడతేర్చాడు. క్రూరంగా ఆమె గొంతుపై కాలుపెట్టి హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి శుక్రవారం కోర్టులో హాజరపరిచి రిమాండ్‌కు తరలించారు.

హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో దారుణం జరిగింది. మద్యం తాగుతోందని, గుట్కాలు తింటోందని ఓ వ్యక్తి భార్యను గొంతుపై తొక్కి చంపేశాడు. స్నేహితుడి ఇంటిలో భార్యను చంపి గుట్టుచప్పుడు కాకుండా పరారయ్యాడు. అనుమానాస్పద స్థితిలో కనిపించిన మహిళ మృతదేహంపై స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేయగా పోలీసులు రంగప్రవేశం చేశారు. కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకున్నారు.

బాలాజీనగర్‌లోని భద్రయ్య వెంచర్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. ఈ నెల 15న ఓ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో దుప్పట్లో  చుట్టి ఉంచిన మహిళ మృతదేహం కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు స్పాట్‌ను పరిశీలించి మహిళ మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆ మహిళను భర్తే కాలితో తొక్కి చంపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈస్ట్ మారెడ్‌పల్లిలో గొల్లకిట్టి బస్తీలో హబీబ్, షేక్ భానుబేగం దంపతులు నివాసముండేవారు. హబీబ్ మెకానిక్‌గా పనిచేస్తుండేవాడు. ఆమెకు మద్యం సేవించడం, గుట్కాలు తినే అలవాటు ఉన్నది. ఇది భర్త హబీబ్‌కు రుచించకపోయేది. అంతేకాదు, తాను ఇంటిలో లేనప్పుడు ఇతరులు వస్తున్నట్టు గమనించాడు. ఆ దురలవాట్లు, ఈ అనుమానాలు అన్నీ కలగలిసి ఎలాగైనా తన భార్యను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు పక్కా పథకాన్ని వేశాడు. ఆ పథకం ప్రకారమే బాలాజీనగర్‌లోని స్నేహితుడు రవి ఇంటికి భార్యను తీసుకెళ్లాడు. రవి ఇంటిలో లేడు. హబీబ్ వద్ద ఉన్న తాళం చెవితో ఇంటి తాళం తీసి లోనికి వెళ్లారు.

పథకం ప్రకారమే హబీబ్ భార్యతో గొడవకు దిగాడు. ఆమెపై భౌతికదాడికి దిగాడు. కాలితో తన్నాడు. మెడపై కాలు పెట్టి తొక్కి హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఇంటిలోనే ఓ దుప్పట్లో చుట్టి వదిలేశాడు. ఎవరూ చూడకముందే పరారయ్యాడు. కానీ, ఆ విషయం ఎంతోకాలం నిలువలేదు. దుప్పట్లో చుట్టి ఉంచిన ఆ మృతదేహాన్ని స్థానికులు చూశారు. అనుమానాస్పద స్థితిలో మృతదేహం కనిపించడంతో పోలీసులకు విషయాన్ని చేరవేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని శుక్రవారం అరెస్టు రిమాండ్‌కు తరలించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu
Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu