కార్వీకి ఈడీ షాక్.. స్టాక్ మార్కెట్‌లోని రూ.700 కోట్ల షేర్లు ఫ్రీజ్

By Siva Kodati  |  First Published Sep 25, 2021, 2:21 PM IST

కార్వీ  సంస్థ షేర్లను ఫ్రీజ్ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ). స్టాక్  మార్కెట్‌లో వున్న షేర్లను ఫ్రీజ్ చేస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసింది. కార్వీకి సంబంధించిన 700 వందల కోట్ల షేర్లను ఈడీ ఫ్రీజ్ చేసింది 


కార్వీ  సంస్థ షేర్లను ఫ్రీజ్ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ). స్టాక్  మార్కెట్‌లో వున్న షేర్లను ఫ్రీజ్ చేస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసింది. కార్వీకి సంబంధించిన 700 వందల కోట్ల షేర్లను ఈడీ ఫ్రీజ్ చేసింది . పార్థసారథితో పాటు అతని కుటుంబసభ్యుల షేర్లు ఫ్రీజ్ చేశారు. స్టాక్ మార్కెట్‌లో షేర్లను కొనడం, అమ్మడం చేయొద్దంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది ఈడీ. 

కాగా, కార్వీ (karvy) కేసులో ఈడీ Enforcement directorate) కొద్దిరోజుల కిందట విస్తృతంగా సోదాలు చేస్తోంది. కార్వీకి అనుబంధ సంస్థల్లో సోదాలు నిర్వహిస్తోంది. బుధవారం నాడు కార్వీకి అనుబంధంగా 16 సంస్థల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని కార్వీతో పాటు దానికి అనుబంధంగా ఉన్న పది అనుబంధ సంస్థల్లో సోదాలు జరుగుతున్నాయి. నగరంలోని ప్రధాన కార్యాలయంతో పాటు బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. కార్వీ సంస్థపై ఈడీ  ఇప్పటికే  కేసు నమోదు చేసిన విషయం తెలిసిదే.

Latest Videos

కార్వీ చైర్మన్ పార్థసారథిని ఇప్పటికే మూడు రోజుల పాటు విచారించింది ఈడీ. మూడు వేల కోట్ల రూపాయల నిధుల గోల్‌మాల్ పై ఈడీ అధికారులు  ఆరా తీయనున్నారు. కార్వీపై ఇప్పటికే సీసీఎస్‌లో  ఐదు కేసులు నమోదు నమోదు అయ్యాయి. పార్థసారథి ఇంటితో పాటు ఇప్పటికే అరెస్టయిన ఐదుగురు ఇళ్లల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. 
 

click me!