మోడీ, అమిత్ షాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్: హైద్రాబాద్‌లో యువకుడి అరెస్ట్

By narsimha lodeFirst Published Jun 30, 2022, 5:33 PM IST
Highlights

షోషల్ మీడయా వేదికగా బీజేపీ నేతలతో పాటు ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ సా కు బెదిరింపులకు పాల్పడిన హైద్రాబాద్ పాతబస్తీకి చెందిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాతబస్తీకి చెందిన మాజీద్ అట్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 
 

హైదరాబాద్:BJP నుండి సస్పెన్షన్ కు గురైన నుపుర్ శర్మ పోస్ట్ పై బీజేపీ, RSS  నేతలు క్షమాపణలు చెప్పకపోతే నిరసనను ఎదుర్కోవాల్సి వస్తుందని సోషల్ మీడియాలో పోస్టు చేసిన Hyderabad పాతబస్తీకి చెందిన మాజిద్ అట్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇంక్విలాబ్ -ఎ- మిల్లత్ నాయకుడు Abdul Majid Attar  సోషల్ మీడియాలో చేసిన పోస్టుపై Police ఆయనను అరెస్ట్ చేశారు.  మాజీద్ పోస్టు శాంతి భద్రతలకు విఘాతం కల్గించేలా ఉందని పోలీసులు చెబుతున్నారు.ఈ పోస్టులో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాలకు బెదిరింపులు కూడా ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదులు అందాయి.  రెండు వర్గాల మధ్య మత విద్వేషాలు కల్గించేలా ఉందని అట్టర్ పోస్టులు ఉన్నాయని పోలీసులు చెప్పారు. మాజీద్ పై ఐపీసీ 153 ఎ, 235ఎ, 504, 505, 506 -2 సెక్షన్ల కింద నమోదు చేశారు. మాజీద్ ను పోలీసులు జడ్జి ముందు హాజరుపర్చారు.

వచ్చే నెల 2,3 తేదీల్లో హైద్రాబాద్ లో బీజేపీ National Executive  సమావేశాలు హైద్రాబాద్ లో జరగనున్నాయి.ఈ నేపథ్యంలో ఈ పోస్టుపై పోలీసులు అలర్టయ్యారు.. ఈ పోస్టు పెట్టిన మాజీద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో  బీజేపీ అగ్రనేతలు  హైద్రాబాద్ కు రానున్నారు. ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు హైద్రాబాద్ కు చేరుకున్నారు. మరో వైపు ఈ కార్యవర్గ సమావేశాలను పురస్కరించుకొని  పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అదే సమయంలో సోషల్ మీడియా పోస్టులపై కూడా నిఘాను ఏర్పాటు చేశారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను పురస్కరించుకొని ఈ నెల 3న బీజేపీ హైద్రాబాద్ లోని పేరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది.ఈ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు.

click me!