కేసీఆర్ వచ్చి తనిఖీ చేసుకోవచ్చు.. ఒక గుంట కూడా కబ్జా చేయలేదు: ఈటల జమున ఫైర్

By Sumanth KanukulaFirst Published Jun 30, 2022, 2:22 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సతీమణి జమున తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ గారడీ చేయడం నేర్చుకున్నారని విమర్శించారు. తాము ఒక గంట భూమి కూడా కబ్జా చేయలేదని చెప్పారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సతీమణి జమున తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ గారడీ చేయడం నేర్చుకున్నారని విమర్శించారు. తాము ఒక గంట భూమి కూడా కబ్జా చేయలేదని చెప్పారు. తాము కబ్జా చేసినట్టుగా నిరూపిస్తే ముక్కు నేలకు రాయటానికి సిద్దంగా ఉన్నట్టుగా తెలిపారు. గురువారం ఆమె శామీర్పేటలో మీడియాతో మాట్లాడారు.  జమునా హెచరీస్ కబ్జా చేస్తే న్యాయపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. రేపు  ముఖ్య మంత్రి కేసీఆర్ అధికారులను తీసుకొని వచ్చి.. జమునా హెచరీస్ భూములను ఎంక్వైరీ చేయించాలన్నారు. 

ముఖ్యమంత్రి బాధ్యతను మరిచి మనికి మలిన పనులన్నీ చేస్తున్నాడని విమర్శించారు. తమ భూమి సర్వే నంబర్లకు.. నిన్న ఇచ్చిన భూముల సర్వే నంబర్లకు ఎటువంటి పొంతన లేదని తెలిపారు. సీఎం కేసీఆర్ కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తమకు 50 నుంచి 60 ఎకరాల భూమి ఉంటే 80 ఎకరాలు ఎలా చూపిస్తున్నారని ప్రశ్నించారు. తమ భూములను కేసీఆర్ అక్రమించుకోవాలని చూస్తున్నట్లున్నాడని కామెంట్ చేశారు. తాము ప్రజలకు సేవ చేసేందుకే ఉన్నామని చెప్పారు. 

కేసీఆర్ దిగజారుడు రాజకీయం చేస్తున్నాడని..  ప్రజలు తరిమికొడుతున్నా బుద్ది మార్చుకోవడం లేదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాము ఒక్క గుంట భూమి ఎక్కడ అక్రమించుకున్నామో చూపించాలని సవాలు విసిరారు. ప్రజలు అధికారం ఇచ్చింది మంచి పనులు చేసేందుకని..ప్రజలను ఇక్కట్లు పెట్టేందుకు కాదని అన్నారు. 

జమున హెచరీస్ భూములను తాము కొనుకున్నామని.. తమ వద్ద అన్ని పాత్రలు సరిగ్గా ఉన్నాయని చెప్పారు. తమ భూములు పంచడానికి ఆ సొమ్మేమైన కెసిఆర్ జాగీరా అంటూ ఫైర్ అయ్యారు. తమ మీద అభియోగాలు పెడితే ప్రజలు నమ్మరని అన్నారు. హుజురాబాద్ టీఆర్ఎస్ ఓటుకు 10 వేలు ఇచ్చిన ఓట్లు పడలేదని అన్నారు. కేసీఆర్ సీఎం కాకముందు ఏం లేకుండేనని.. ఇప్పుడు పదవితో అన్ని సంపాదించుకున్నారని ఆరోపించారు. అబద్దాలు ఆడుతున్నందుకు కేసీఆర్‌కు పాపం తగులుతుందని కామెంట్ చేశారు. తమ భూములు కాకున్న జమునా హెచరీస్ భూములు అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని చెప్పారు. 
 

click me!