తెలంగాణలో కాంగ్రెస్‌కు అంత సీన్ లేదు.. బీజేపీలో చేరుతున్నా: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

By Siva KodatiFirst Published Jun 30, 2022, 5:32 PM IST
Highlights

మాజీ ఎంపీ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తాను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. 

మాజీ ఎంపీ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల్లో యాక్టీవ్ కావాలని భావిస్తున్న ఆయన కాంగ్రెస్ లేదా బీజేపీల్లో చేరాలని భావించారు. కానీ ఈ విషయంలో క్లారిటీ లేకపోవడంతో సైలెంట్ అయ్యారు. ఈ క్రమంలో తాజాగా తన నిర్ణయాన్ని ప్రకటించారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. తాను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. 

గురువారం విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా బలహీనపడిందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ కు అంత శక్తి లేదంటూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణవాదులను కేసీఆర్ మోసం చేశారని ఆయన మండిపడ్డారు. నియంత పాలనను అంతం చేయడం బీజేపీకే సాధ్యమని కొండా పేర్కొన్నారు. కేసీఆర్ పక్కన పువ్వాడ, తలసాని, సబిత, తలసాని లాంటి వాళ్లు వున్నారని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తల దోపిడీ ఎక్కువైందని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ తొందర్లోనే ఖతం అవుతుందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి జోస్యం చెప్పారు. యాంటీ కేసీఆర్ ఓటు బీజేపీకే వెళ్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఐదు అంశాలపై బీజేపీని క్లారిటీ అడిగానని.. 2 అంశాలపై స్పష్టత ఇచ్చారని విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. 

click me!