దారుణం : మద్యం మత్తులో కన్న కూతురిమీదే అత్యాచారయత్నం.. దేహశుద్ధి..

Published : Sep 24, 2021, 11:18 AM IST
దారుణం : మద్యం మత్తులో కన్న కూతురిమీదే అత్యాచారయత్నం.. దేహశుద్ధి..

సారాంశం

ఇలాంటి ఘటనే హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో చోటు చేసుకుంది. కూతురిపై తండ్రి అత్యాచారానికి యత్నించాడు. ఈ సంఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

రోజురోజుకూ కన్నకూతుర్లపైనే లైంగిక దాడికి ( rape attempt)పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని మసకబారేలా ప్రవర్తిస్తున్నారు కీచకులు. కామంతో కన్నూ,మిన్నూ కానక.. వావివరసలు మరిచి.. కడుపున పుట్టిన కూతుర్లనే కాటేసేందుకు సిద్ధమవుతున్నారు. 

తమ చేతుల్లో అల్లారు ముద్దుగా పెరిగిన చిన్నారులను, తాము గోరుముద్దలు తినిపించిన తమ కలలపంటనే వక్రబుద్దితో చూస్తున్నారు. కూతుర్లోనూ కేవలం ఆడదాన్ని మాత్రమే చూస్తూ.. లైంగిక దాడికి పాల్పడుతున్నారు. అత్యంత హేయమైన ఇలాంటి దారుణాలు పెరుగుతుండడం గగుర్పాటుకు గురి చేస్తున్నాయి. 

దుప్పట్లో చుట్టిన మహిళ మృతదేహం తీసుకెళ్తూ పట్టుబడిన ఇద్దరు యువకులు

ఇలాంటి ఘటనే హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో చోటు చేసుకుంది. కూతురిపై తండ్రి అత్యాచారానికి యత్నించాడు. ఈ సంఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెడితే... పదిహేడేళ్ల బాలిక ఇంటర్ పూర్తిచేసి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. గురువారం మధ్యాహ్నం సమయంలో తండ్రి ఇంటికి వచ్చాడు. 

ఆ టైంలో ఇంట్లో భార్య లేదు. తండ్రి మద్యం మత్తులో ఉన్నాడు. ఎదురుగా కూతురు కనిపించింది. తండ్రి బాలిక మీద లైంగిక దాడికి ప్రయత్నించాడు. దీంతో బాలిక దడుచుకుంది. వెంటనే విడిపించుకుని బయటికి పరిగెత్తుకొచ్చింది. పక్కింటి మహిళకు విషయం చెప్పింది. వెంటనే ఆమె స్థానికుల్ని అప్రమత్తం చేయడంతో.. వారు తండ్రికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu