Telangana Assembly: ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సీఎల్పీ కార్యాచరరణ, కాంగ్రెస్ ఎజెండా ఇదీ...

By narsimha lodeFirst Published Sep 24, 2021, 10:58 AM IST
Highlights

 రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై  అసెంబ్లీలో అధికార పార్టీని నిలదీయాలని సీఎల్పీ నిర్ణయించింది.దళితబంధు, విద్యుత్ ఛార్జీల పెంపు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని సీఎల్పీ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.

హైదరాబాద్: దళితబంధు (Dalitha bandhu), ఆర్టీసీ (TS RTC), విద్యుత్ ఛార్జీల (Electricity charges) పెంపు ప్రతిపాదనలపై అసెంబ్లీలో (Telangana Assembly sessions) ప్రభుత్వాన్ని నిలదీయాలని సీఎల్పీ  (CLP)నిర్ణయం తీసుకొంది.ఇవాళ్టి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించేందుకు సీఎల్పీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించే విధానాలను ఎండగట్టాలని నిర్ణయం తీసుకొన్నారు.

ప్రతి అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా వ్యవహరించాలని నిర్ణయించారు.  ప్రభుత్వం నుండి సమాధానం రాబట్టేందుకు చర్చకు పట్టుబట్టాలని సీఎల్పీ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్ణయించారు.దళితబంధును రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వర్తింపజేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.ఈ విషయమై కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేయనున్నారు.

.నిరుద్యోగం, దళితబంధు, కృష్ణా నది జలాల వివాదం, పోడు భూములు, డ్రగ్స్, ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపు, వైద్య ఆరోగ్యశాఖ తదితర అంశాలపై చర్చించాలని  ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది.ఇవాళ జరిగే బీఎసీ సమావేశంలో  అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.


 

click me!