కాంగ్రెస్ పార్టీనా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా?: రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి ఫైర్

Published : Sep 24, 2021, 10:26 AM IST
కాంగ్రెస్ పార్టీనా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా?:     రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి ఫైర్

సారాంశం

 టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సీరియస్ అయ్యారు.పార్టీలో చర్చించకుండానే రెండు నెలల కార్యాచరణను ఎలా ప్రకటిస్తారని రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి ఆవేశంతో ఊగిపోయారు.


హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Tpcc chief Revanth Reddy) పై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) సీరియస్ అయ్యారు. పార్టీ సీనియర్ నేతల మధ్య జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి తీరుపై ఆవేశంతో ఊగిపోయారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు గాను సీఎల్పీ సమావేశానికి ముందు పార్టీ సీనియర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జగ్గారెడ్డి  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై ఆగ్రహంతో ఊగిపోయారు.

ఇది కాంగ్రెస్ పార్టీయా? లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా అని ప్రశ్నించారు. పార్టీ సీనియర్లతో చర్చించకుండానే రెండు మాసాల కార్యాచరణను ఎలా ప్రకటిస్తారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. జహీరాబాద్ లో క్రికెట్ మ్యాచ్ విషయంలో గీతారెడ్డికి సమాచారం ఇవ్వరా? అని ఆయన అడిగారు. సంగారెడ్డికి వస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న నాకే సమాచారం ఇవ్వరా? అని ఆయన అడిగారు. కనీసం ప్రోటోకాల్ పాటించాలి కదా అని అడిగారు.

సమాచారం ఇవ్వకుండా నాతో విబేధాలు ఉన్నట్టు రేవంత్  చెప్పాలని అనుకొంటున్నారా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.కాంగ్రెస్ లో ఏ ఒక్కరో హీరో కాలేరని ఆయన చెప్పారు.గత శనివారం నాడు జూమ్ మీటింగ్ లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో రెండు మాసాల కార్యాచరణపై చర్చించారు.ఈ సమావేశానికి కొందరు సీనియర్లు హాజరు కాలేదు. అయితే సీనియర్లకు చెప్పకుండానే ఈ కార్యాచరణను ఎలా ప్రకటిస్తారని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ