కారణమిదే:కేబినెట్‌లో భారీ మార్పులకు కేసీఆర్ ప్లాన్?

By narsimha lode  |  First Published Jan 7, 2020, 8:03 AM IST

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో త్వరలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల తర్వాత కేబినెట్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది.

Also read:సీఎంగా కేటీఆర్: ప్లాన్ రెడీ,కేసీఆర్ భవిష్యత్తు ఆచరణ ఇదీ?

Latest Videos

ఈ బడ్జెట్ సమావేశాల కంటే ముందే క్యాబినెట్ లో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో భారీగా మార్పులు చేర్పులు చేపడతారా లేకపోతే ఉన్న మంత్రివర్గంలో సభ్యుల్లో ఎక్కువమంది మంత్రివర్గం నుండి తప్పిస్తారా అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.

also read:తెలంగాణ ఎన్నికల సంఘానికి హైకోర్టు షాక్: మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్ 

ప్రస్తుతం ఉన్న మంత్రులు కొందరిని కేసీఆర్ తప్పించే అవకాశం ఉంది. పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశంలో ఈ మేరకు కేసీఆర్ మంత్రులను హెచ్చరించారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి పాలైతే మంత్రి పదవులు ఊడిపోతాయని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. 

also read: తెరపైకి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్: కేటీఆర్‌కు సీఎం పదవి?

 ఇదే తరుణంలో కొందరు మంత్రులు కేటీఆర్ ను సపోర్ట్ చేస్తూ ప్రకటనలు చేశారు. ప్రస్తుతం ఉన్న మంత్రులు కనీసం ఐదు మందిని తప్పించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. కెసిఆర్‌ను సంతృప్తిపరిచే విధంగా పనితీరు లేని మంత్రులు కేబినెట్ బెర్త్ ను కోల్పోయే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. 

Also read: వీక్లీ రౌండప్: మంత్రుల మెడకు మున్సిపల్ ఉచ్చు, కేటీఆర్‌కు సీఎం పదవి?

వాస్తవానికి గత ఏడాది సెప్టెంబర్ మాసంలో జరిగిన మంత్రివర్గ విస్తరణ లోనే  ఐదు మందిని  మంత్రివర్గం నుండి తప్పించాలని కేసీఆర్ భావించారు. కానీ ఆ సమయంలో ఉన్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వారిని మంత్రివర్గంలోనే కొనసాగించారు.

Also read:వీక్లీ రౌండప్:దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం, కరీంనగర్ కలెక్టర్‌ బదిలీ

ఈ ఏడాది కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసేందుకు వీలుగా కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తోంది. కేసీఆర్ రాజీనామా చేస్తే  ఆయన మంత్రి వర్గం కూడా ఆటోమేటిక్‌గా రద్దుకానుంది. 

Also read:రాజధాని రాజకీయం: అమరావతి భవితపై ఆందోళన, ముంచుతారా తేల్చుతారా?

ఒకవేళ కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడం మరింత ఆలస్యం అయితే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కేటీఆర్ ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తే కొందరు కొత్తవాళ్లకు కేబినెట్ లో చోటు చేసుకొనే అవకాశం ఉంది.

కేటిఆర్ మంత్రివర్గంలో  రాజ్యసభ సభ్యుడు సంతోష్ కేటీఆర్ మంత్రివర్గంలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అదేవిధంగా బాల్క సుమన్ శాసన మండలి ఛైర్మన్ సుఖేందర్ రెడ్డికి కూడా కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

 కెసిఆర్ కేటీఆర్ లో ఒక జిల్లాలోని ఇద్దరు మంత్రుల పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు వారిద్దరికీ మంత్రివర్గం నుంచి తప్పించేందుకు కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది 

click me!