హైదరాబాద్‌లో మళ్లీ రెచ్చిపోతున్న లోన్ యాప్స్ నిర్వాహకులు.. కొత్తగా 291 లోన్ యాప్స్ గుర్తింపు

Published : Mar 26, 2022, 01:02 PM IST
హైదరాబాద్‌లో మళ్లీ రెచ్చిపోతున్న లోన్ యాప్స్ నిర్వాహకులు.. కొత్తగా 291 లోన్ యాప్స్ గుర్తింపు

సారాంశం

హైదరాబాద్‌లో లోన్ యాప్ నిర్వాహకులు మళ్లీ రెచ్చిపోతున్నారు. కొత్తగా 291 లోన్ యాప్స్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగించాలని సైబర్ క్రైమ్ పోలీసులు లేఖ రాశారు. 

హైదరాబాద్‌లో లోన్ యాప్ నిర్వాహకులు మళ్లీ రెచ్చిపోతున్నారు. గతంలో లోన్ తీసుకున్నవారిని యాప్ నిర్వాహకులు వేధింపులకు గురిచేస్తున్నారు. అంతేకాకుండా లోన్ తీసుకోకపోయినా బలవంతంగా చిత్రహింసలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇందుకు సంబంధించి కొద్ది రోజుల్లోనే సైబర్ క్రైమ్ పోలీసులు 50 కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన పోలీసులు 291 కొత్త లోన్ యాప్‌లను గుర్తించారు. లోన్ యాప్స్‌‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించాలని సైబర్ క్రైమ్ పోలీసులు లేఖ రాశారు. సైబర్ క్రైమ్ పోలీసుల లేఖతో 50 లోన్ యాప్‌లను ప్లేస్టోర్ నుంచి తొలగించారు.

ఈ క్రమంలోనే లోన్ యాప్స్ విషయంలో సైబర్ క్రైమ్ పోలీసుల ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు. లోన్ యాప్‌లో ఎవరూ కూడా రుణాల కోసం ఎగపడొద్దని సూచించారు. ఒక్కసారి లోన్‌యాప్‌లో రిజిస్టర్ చేస్తే కాంటాక్ట్స్ అన్ని కేటుగాళ్ల చేతుల్లోకి పోతాయని హెచ్చరించారు. ఇక, లోన్ యాప్ ప్రధాన నిర్వాహకురాలు జెన్నీఫర్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Numaish : హైదరాబాద్ నడిబొడ్డున మరో అగ్నిప్రమాదం.. బయటపడ్డ షాకింగ్ నిజాలు ! నుమాయిష్ కు రావొద్దన్న సీపీ
Kavitha: ఇక స‌మ‌ర‌మే.. ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోన్న క‌విత‌. తండ్రి కారు అయితే కూతురు..?