రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరుస దొంగతనాలు.. ఆందోళనలో స్థానికులు..

By SumaBala BukkaFirst Published Mar 26, 2022, 12:41 PM IST
Highlights

సిరిసిల్లా జిల్లాలో వరుస దొంగతనాలు కలవరపెడుతున్నాయి. వేసవి కావడంతో దొంగలు రెచ్చిపోతున్నారు. దీంతో స్తానికులు భయాందోళనలో ఉన్నారు. 

సిరిసిల్లా : Rajanna Sirisilla District కోనరావుపేట మండలం నిమ్మపల్లిలో ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. వేసవి కావడంతో కుటుంబం మొత్తం ఇంటి స్లాబ్ పై పడుకున్నారు. ఇదే అదనుగా దొంగలు ఇంటి తాళలు పగులగొట్టి నగదు, బంగారం దోచుకెళ్ళారు. దీనిమీద పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత 10 రోజుల క్రితం ఇదే గ్రామంలో మూడు ఇళ్లలో దొంగతనం జరిగింది. ఇలా గ్రామంలో వరుసగా దొంగతనాలు జరుగుతుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

ఇదిలా ఉండగా, మార్చి 16న madhya pradeshలో Royal Enfield బైక్‌లను (బుల్లెట్‌) నిముషం వ్యవధిలో దొంగతనం చేస్తున్న ఇద్దరు యువకులను నగర పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. అంతేకాదు వారు theft ఎలా ఎంత ఈజీగా చేస్తారో పోలీసులకు demo చేసి చూపించారు. ఆ యువకుల చాకచక్యానికి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. 66 కళల్లో చోరకళ కూడా ఒకటి. దాన్ని ఇదిగో ఇలాంటి యువకులను చూసే చెప్పి ఉంటారు. సెకన్లలో లాక్ వేసి ఉన్న బైక్ ను కొట్టేసి.. నిమిషంలో బండితో సహా మాయమైపోవడం వీళ్ల ప్రత్యేకత.

పోలీస్ స్టేషన్ లో డెమో చేస్తున్నప్పుడు పోలీసులు దీన్నంతా వీడియో తీశారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గ్వాలియర్ నగరంలోని డీడీ నగర్ ప్రాంతంలో తాము కొట్టేసిన బుల్లెట్‌ను దాచేందుకు ఇద్దరు యువకులు అక్కడికి వస్తున్నారని తెలిసింది. దీంతో అక్కడి పోలీస్ ఇన్‌ఫార్మర్‌ ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు. దీంతో వెంటనే పోలీసులు అలెర్ట్ అయి రంగంలోకి దిగారు. 

ఆ తర్వాత సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సిఎస్‌పి) రవి భడోరియా బృందంగా ఏర్పడి వారిని పట్టుకునేందుకు డీడీ నగర్ ప్రాంతంలో తమ బలగాలతో మోహరించారు. యువకులు బుల్లెట్ తో అక్కడికి చేరుకోగానే పోలీసు బృందం చుట్టుముట్టి పట్టుకున్నారు.

యువకులను మోరెనా జిల్లాకు చెందిన శ్యామ్ గుర్జార్, బజ్నా గురాజ్‌లుగా గుర్తించారు. ఘటనా స్థలం నుంచి మూడు బైక్‌లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్‌లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు మంచి ధర రావడంతో వాటిని మాత్రమే దొంగిలిస్తున్నామని వారు విచారణలో పోలీసులకు తెలిపారు.ఇద్దరు యువకులను అరెస్టు చేశామని, తదుపరి చర్యలు కొనసాగుతున్నాయని భదౌరియా చెప్పారు.
 

click me!