బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 నిర్వాహకులకు హైద్రాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
హైదరాబాద్: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 నిర్వాహకులకు సోమవారంనాడు హైద్రాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 17వ తేదీన బిగ్ బాస్ ఫైనల్ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియో వద్ద ఘర్షణ చోటు చేసుకుంది.ఈ ఘటన నేపథ్యంలో బిగ్ బాగ్ తెలుగు సీజన్ 7 యాజమాన్యం ఎండమోల్ షైన్ కు నోటీసులు జారీ చేశారు.
also read:ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ,జనసేన పొత్తు: బీజేపీ దారెటు?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 నిర్వాహకులకు సోమవారంనాడు హైద్రాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 17వ తేదీన బిగ్ బాస్ ఫైనల్ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియో వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణ నేపథ్యంలో పోలీసులు నోటీసులు ఇచ్చారు.
also read:ప్రశాంత్ కిషోర్, వై.ఎస్.షర్మిల సంకేతాలు: జగన్ కు దెబ్బేనా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 టైటిల్ ను పల్లవి ప్రశాంత్ కైవసం చేసుకున్నారు. ఈ నెల 17వ తేదీ రాత్రి హైద్రాబాద్ అన్నపూర్ణ స్టూడియో వద్ద పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.ఈ ఘటన కారణంగా ఆర్టీసీ బస్సులు, కార్లపై దాడులు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణ మరింత తీవ్రతరం కావడానికి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కారణమని జూబ్లీహిల్స్ పోలీసులు తేల్చి చెప్పారు. గొడవ పెద్దది కావడానికి పల్లవి ప్రశాంత్ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు.ఈ విషయమై రెండు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టై న పల్లవి ప్రశాంత్ కు రెండు రోజుల క్రితం బెయిల్ వచ్చింది.
బిగ్ బాస్ నిర్వాహకులను కూడ విచారిస్తామని రెండు రోజుల క్రితం హైద్రాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ ఫైనల్ సందర్భంగా నిర్వాహకులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనే విషయమై పోలీసులు విచారించే అవకాశం లేకపోలేదు.
పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ అభిమానుల ఘర్షణ చిలికి చిలికి గాలి వానగా మారింది. పలు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ కార్లు, పోలీస్ వాహనాలు ధ్వంసానికి కారణమైంది. దీంతో ఈ ఘర్షణపై పల్లవి ప్రశాంత్ పై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘర్షణ సందర్భంగా ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేయడాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీవ్రంగా తప్పుబట్టారు.ఈ విషయమై ఆయన మండిపడ్డారు. అభిమానం పేరుతో విధ్వంసాలకు పాల్పడి కేసుల్లో ఇరుక్కోవద్దని సూచించారు.