Bandi Sanjay : 6 గ్యారెంటీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. అయితే దాని కంటే ముందు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించాల్సి ఉండాల్సిందని చెప్పారు. కరీంనగర్ బీజేపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు.
Bandi Sanjay : గ్యారెంటీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. అయితే దాని కంటే ముందు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించాల్సి ఉండాల్సిందని చెప్పారు. కరీంనగర్ బీజేపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు.
డిప్యూటీ సీఎం భట్టితో కోదండరామ్ భేటీ.. టీజేఎస్ చీఫ్ కు మంత్రి పదవి ఖాయమైనట్టేనా ?
undefined
తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో గ్రామ సభలు నిర్వహించి 6 గ్యారెంటీల కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు సిద్ధమవుతోంది. అయితే దీనిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్వాగతిస్తూనే.. ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. ఈ ఆరు గ్యారెంటీలకు రేషన్ కార్డే ప్రధాన అర్హతగా పరిగణిస్తారని తెలుస్తుండటంపై పట్ల ఆయన సందేహం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి జయంతిని కరీంనగర్ బీజేపీ ఆఫీసులో నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
దావుద్ ఇబ్రహీంకు షాక్.. ఆస్తులను వేలం వేసేందుకు సిద్ధమైన భారత ప్రభుత్వం..
తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్లుగా ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని బండి సంజయ్ అన్నారు. ఇప్పటికే 10 లక్షల కుటుంబాలు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాయని గుర్తు చేశారు. ఇంకా లక్షలాది కుటుంబాలు దరఖాస్తులు చేసుకునేందుకు ఎదురు చూస్తున్నాయని తెలిపారు. అయితే ఈ గ్యారెంటీల కోసం రేషన్ కార్డులే ప్రామాణికంగా తీసుకోవడం వల్ల రేషన్ కార్డు లేని వారికి ఏ విధంగా న్యాయం చేస్తారని ప్రశ్నించారు.
పాతబస్తే అసలైన హైదరాబాద్.. హైకోర్టును అక్కడి నుంచి తరలించొద్దు - అసదుద్దీన్ ఒవైసీ..
కాబట్టి తక్షణమే కొత్త రేషన్ కార్డుల మంజూరుకు దరఖాస్తులు స్వీకరించాలని బండి సంజయ్ ప్రభుత్వానికి సూచించారు. దీంతో పాటు రాజకీయాలకు అతీతంగా నిజమైన లబ్దిదారులను గుర్తించి 6 పథకాలను అమలు చేయాలని కోరారు. దీని కోసం అన్ని రాజకీయ పార్టీలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని తెలిపారు. ఎన్నికల సమయంలో 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని గుర్తు చేశారు. దాని కోసం దరఖాస్తులు స్వీకరించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు.
బిడ్డలను కాపాడేందుకు తల్లి సాహసం.. మృత్యువు పై నుంచి వెళ్తున్నా.. బెదరని మాతృమూర్తి.. వీడియో వైరల్
అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల లోపే లబ్దిదారులను గుర్తించి, అమలు చేయాలని ఆయన అన్నారు. ఎన్నికల సాకు చూపి గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా దరఖాస్తులకే పరిమితం కాకూడదని కోరారు. బీఆర్ఎస్ గతంలో ప్రజలను నమ్మించి మోసం చేసిందని బండి సంజయ్ ఆరోపించారు. హామీలిచ్చి చేతులు దులుపుకోవడం వల్లే ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారని విమర్శించారు. ఆ తప్పు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాంటి తప్పులను చేయకూడదని ఆయన సూచించారు.