దక్షిణ భారతదేశంలో అత్యంత కాలుష్య నగరంగా హైదరాబాద్

Published : Mar 23, 2022, 12:27 PM IST
దక్షిణ భారతదేశంలో అత్యంత కాలుష్య నగరంగా హైదరాబాద్

సారాంశం

దక్షిణ భారతదేశంలోని పెద్ద నగరాల్లో హైదరాబాద్ లోనే కాలుష్యం అధికంగా ఉందని తాజా నివేదిక స్పష్టం చేస్తున్నాయి. కరోనా లాక్ డౌన్ సమయంలో గాలిలో నాణ్యత కొంత మెరుగుపడింది. అయితే తరువాత కాలంలో మళ్లీ కాలుష్యం పెరిగిందని ఈ నివేదిక తెలిపింది. 

హైదరాబాద్ లో గాలు కాలుష్యం పెరుగుతోంది. ప్రతీ యేడు గాలిలో నాణ్యత తగ్గిపోతోంది. 2020తో పోలిస్తే 2021 లో హైదరాబాద్‌లో గాలి నాణ్యత మరింత దిగజారింది. దక్షిణ భారతదేశంలోనే అత్యంత కలుషితమైన మెగా సిటీగా నిలిచింది.

స్విస్‌కు చెందిన ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఐక్యూ ఎయిర్ మంగళవారం ప్రపంచ వాయు నాణ్యత నివేదికను వెల్లడించింది. భూమ్మీద ఉన్న‌100 అత్యంత కాలుష్య న‌గ‌రాల్లో భారత్‌కు చెందిన 63 నగరాలు ఈ జాబితాలో ఉండటం షాకింగ్ కు గురి చేస్తుంది.  ప్రాణాంతక, మైక్రోస్కోపిక్ PM2.5 కాలుష్య కారకంలో కొలవబడిన సగటు వాయు కాలుష్యం, క్యూబిక్ మీటరుకు 58.1 మైక్రోగ్రాములు.. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వాయు నాణ్యత మార్గదర్శకాల కంటే 10 రెట్లు ఎక్కువ. భారతదేశంలోని ఏ నగరమూ WHO ప్రమాణాన్ని అందుకోకపోవడం చెప్పుకోదగ్గ అంశం. ఉత్తర భారతదేశంలో ఈ ప‌రిస్థితి మ‌రింత‌ అధ్వాన్నంగా ఉంది. 

ఈ నివేదిక హైద‌రాబాద్ లో వాయు కాలుష్యం అధికంగా ఉంద‌ని తేట‌తెల్లం చేసింది. క‌రోనా లాక్ డౌన్ స‌మ‌యంలో గాలిలో నాణ్య‌త మెరుగుప‌డిన‌ప్ప‌టికీ మ‌ళ్లీ ఇప్పుడు పాత స్థితికి చేరుకుంది  2020లో హైద‌రాబాద్  పార్టిక్యులేట్ మ్యాటర్ (PM) 2.5 వార్షిక సగటుతో క్యూబిక్ మీట‌రుకు 39.7 గ్రాములుగా ఉంది, అయితే 2021లో సగటు PM 2.5 39.4 క్యూబిక్ మీట‌రుగా ఉన్న‌ప్ప‌టికీ డిసెంబ‌ర్ లో ఇది 68.4 క్యూబిక్ మీట‌రుకు చేరుకుంది. అయితే అది జూలైలో కొంత మెరుగుప‌డింది.

హైద‌రాబాద్ లో వాయు కాలుష్యానికి ఆటోమొబైల్స్, పరిశ్రమలు ప్ర‌ధాన కార‌ణాలుగా నిలుస్తున్నాయి.  పెరుగుతున్న వాహ‌నాలు కూడా కాలుష్యానికి కారణం అవుతున్నాయి. తాజా నివేదిక ప్ర‌కారం హైదరాబాద్లోని ప్రజలు సంవత్సరంలో మూడింట ఒక వంతు అధిక స్థాయి PM 2.5 కింద‌ గడిపారు. న‌గ‌రంలో రెండు నెల‌ల పాటు వాయు కాలుష్యం చాలా త‌క్కువ‌గా న‌మోదు అయ్యింది. మిగిలిన సంవ‌త్స‌రం అంతా  కాలుష్యం స్థాయి మధ్యస్థం గా ఉంది.

హైద‌రాబాద్ సిటీలో 2017 - 2020 మధ్య కాలంలో PM 2.5లో మెరుగైన గాలి నాణ్య‌త న‌మోదు చేసింది. మొక్క‌ల పెంప‌కం చేప‌ట్ట‌డం, క‌ఠిన‌మైన ఆటోమొబైల్ నిబంధ‌న‌లు అమ‌లు చేయ‌డం వ‌ల్ల కాలుష్యం త‌క్కువ‌గా న‌మోదు అయ్యింది. అయితే 2021 నుంచి మ‌ళ్లీ పెర‌గ‌డం ప్రారంభించింది. 

‘‘ చిన్న చిన్న కాలుష్య రేణువులు (PM 2.5) మానవ ఆరోగ్యా నికి అత్యంత ప్రమాదకరం. అయితే ముక్కు చాలా వరకు కాలుష్య కణాలను ఫిల్టర్ చేయగలదు. కానీ అతి సూక్ష్మమైన, అల్ట్రా ఫైన్ కణాలు ఊపిరితిత్తులలోకి లోతుగా డైరెక్ట్ గా వెళ్తాయి. అవి అక్కడ జమ అవుతాయి. లేకపోతే డైరెక్ట్ గా రక్తప్రవాహంలోకి కూడా వెళ్లే అవకాశం ఉంటుంది ’’ అని నివేదిక హెచ్చరించింది. హైదరాబాద్ తో పాటు ప్రపంచంలోని చాలా నగరాలు WHO గాలి నాణ్యత ప్రమాణాలను చేరుకోవడంలో విఫలం అయ్యాయని ఈ నివేదిక తెలిపింది. ప్ర‌స్తుతం వాయు కాలుష్యం రోగాల‌కు రెండవ అతిపెద్ద ప్రమాద కారకంగా ఉందని హెచ్చరించింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణపై చలిపిడుగు... ఈ నాలుగు జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త
Hyderabad: కేవలం రూ. 1 కే కడుపు నిండా భోజనం..