ఆటో డ్రైవర్ పై ట్రాన్స్ జెండర్ల దాడి.. ఎందుకో తెలిస్తే షాక్...

Published : Mar 23, 2022, 11:04 AM IST
ఆటో డ్రైవర్ పై ట్రాన్స్ జెండర్ల దాడి.. ఎందుకో తెలిస్తే షాక్...

సారాంశం

ఓ ఆటో డ్రైవర్ పై ట్రాన్స్ జెండర్లు దారుణానికి తెగబడ్డారు. అతనిమీద దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో తీవ్రరక్తస్రావంతో అతను ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనికి కారణం ఆ ఆటో డ్రైవర్ మరో ట్రాన్స్ జెండర్ లో లైంగిక సంబంధం పెట్టుకోవడమే కారణమని తెలుస్తోంది.

హైదరాబాద్ : హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఛత్రినాకలోని లలితాబాగ్‌లో మంగళవారం తెల్లవారుజామున 24 ఏళ్ల యువకుడిపై ఇద్దరు transgenderలు బ్లేడ్లు, కత్తులతో attack చేశారు. ఈ దాడిలో auto rickshaw driverగా పనిచేస్తున్న షేక్ అఫ్రోజ్ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడికి ఛాతీ, మణికట్టు, తొడపై తీవ్రగాయాలయ్యాయి. అతను ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. Sexual jealousyల కారణంగానే దాడికి పాల్పడినట్లు సమాచారం.

“నాకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత రెండేళ్లుగా మెహక్ అనే ట్రాన్స్‌జెండర్‌తో నాకు ఎఫైర్ ఉంది. మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో, నన్ను ఇద్దరు ట్రాన్స్ జెండర్ వ్యక్తులు షేక్ గౌస్, సోహిల్ షేక్ పార్టీకి ఆహ్వానించారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఘౌస్, సోహిల్ నాపై దాడి చేశారు” అని అఫ్రోజ్ చెప్పాడు. విషయం తెలిసిన వెంటనే అఫ్రోజ్‌ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.

బార్కాస్ సలాలా నివాసి, అఫ్రోజ్‌కు మెహెక్ అలియాస్ తర్రానుమ్ ఖాన్‌తో శారీరక సంబంధం ఉందని ట్రాన్స్‌జెండర్ ముస్కాన్ తెలిపారు. అనేక సందర్భాల్లో అఫ్రోజ్ మెహక్‌ను వాణిజ్యపరమైన సెక్స్ వర్క్ కు వెళ్లకుండా ఆపేశాడని ఆమె చెప్పింది. అంతేకాదు గత రెండేళ్లుగా అఫ్రోజ్ తన డబ్బును మెహక్ కోసం ఖర్చు చేసి అప్పులు కూడా చేశాడు. ఇంతగా చూసుకున్న అఫ్రోజ్ కొంత కాలంగా మెహక్ ను దూరం పెట్టడం మొదలుపెట్టాడని సమాచారం. 

అఫ్రోజ్ మీద దాడి తరువాత.. ప్రధాన నిందితుడు,  భవానీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో పోలీసు ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తున్న గౌస్‌ పరారయ్యాడు. ఈ ఘటనను హత్యాయత్నం కింద కేసు నమోదు చేశామని ఫలక్‌నుమా డివిజన్‌ ​​అసిస్టెంట్‌ కమీషనర్‌ మహ్మద్‌ మజీద్‌ తెలిపారు.

ఇదిలా ఉండగా, మార్చి 17న ఇలాంటి ఘటనే కర్నూలులో చోటు చేసుకుంది.  బైక్ మీద వెడుతున్న దంపతుల మీద Hijraలు దాడి చేశారు. నంద్యాల పట్టణ శివారులో ఈ ఘటన జరిగింది. బాధితులు తెలిపి వివరాల మేరకు.. holi festival ఉండటంతో పాణ్యం మండలం రాంభూపాల్ రెడ్డి తండాకు చెందిన బాలనాయక్, హనీమాబాయి దంపతులు నిత్యావసరం సరుకుల కోసం నంద్యాల పట్టణానికి bike మీద బయలుదేరారు. ఆటో నగర్ శివారులోని హనీ, ఆశ అనే హిజ్రాలు వారి బైక్ మీద అడ్డగించి డబ్బు అడిగారు. తన వద్ద చిల్లర డబ్బులు లేవనడంతో వారు బలవంతంగా బాలనాయక్ జేబులో చేతులు పెట్టి రూ. 100 నోటు లాక్కునే ప్రయత్నం చేశారు. 

ఇవ్వకపోవడంతో బైక్ పై ఉన్న ఆ దంపతులను కిందకు తోసి వారి మీద దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటనలో బాలనాయక్ భార్య మెడలో ఉన్న రెండు తులాల బంగారు తాళిబొట్టు గొలుసు మాయం కావడంతో వారు రూరల్ సీఐ మురళీమోహన్ రావును కలిసి ఫిర్యాదు చేశారు. దాడి చేసిన హిజ్రాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. హిజ్రాలు ఇలా దాడులకు పాల్పడడం మామూలుగా మారడంతో వారిని చూస్తేనే భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Medaram Jathara 2026 : మేడారంకు ఎక్కడెక్కడి నుండి ఆర్టిసి బస్సులుంటాయి.. ఎక్కడి నుండి ఎంత ఛార్జీ..?
Teacher Suspend for Making Reels:పాటలుపాడలేదు పాఠాలునేర్పించా.. బోరుమన్న టీచర్ | Asianet News Telugu